Uttam Kumar Reddy : నిరాశ నిస్పృహలో కెసిఆర్ గాలి మాటలు
రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో 11మంది మంత్రులం మంచి క్రికెట్ టీమ్‌లా పనిచేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు.
మా ఎమ్మెల్యేలు కేసీఆర్‌కు టచ్ లో ఉన్నారనడం ఈ దశాబ్దపు జోక్
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో 11 మంది మంత్రులం జట్టుగా ఉన్నాం
హుజూర్ నగర్ రోడ్ షో లో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
ప్రజా దీవెన, హుజూర్నగర్: రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో 11మంది మంత్రులం మంచి క్రికెట్ టీమ్‌లా పనిచేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి(Uttam kumar reddy)అన్నారు. ఆదివారం రాత్రి సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌లోని రాజీవ్‌గాంధీ ప్రాంగణం లో నిర్వహించిన నియోజకవర్గ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ నిస్పృహలో ఉన్నారని, సిగ్గు, లజ్జ లేకుండా ఏది పడితే అది మాట్లాడుతున్నారని విమర్శించారు.
తెలంగాణలో కాంగ్రెస్(Congress)అధికారంలో ఉండి మంచి పరిపాలన చేస్తుంటే, 25 మంది ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నా రని కేసీఆర్ చెప్పడం ఈ దశాబ్దపు జోక్ అని ఎద్దేవా చేశారు. రూ.లక్ష కోట్లతో కేసీఆర్ కట్టిన కాళేశ్వరం నాలుగేళ్లలో కూలిపోయిందని, ఆయన సాగర్ ప్రాజెక్ట్ గురించి, నీళ్ల గురించి, కరువు గురించి మాట్లాడ డం సిగ్గుచేటన్నారు. రైతులకు అన్యాయం చేసిన కేసీఆర్ ఇప్పుడు రైతుల గురించి పర్యటన చేయడా నికి సిగ్గు, శరం ఉండాలన్నారు.
పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలకు డిపాజిట్ రాకుండా చేయాలన్నారు. రాష్ట్రంలో ఏడు వేల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, కనీస మద్దతు ధర కంటే తక్కువకు ధాన్యం కొంటే కఠిన చర్య లు తీసుకుంటామన్నారు. రైతులకు(Farmers)రూ.500బోనస్ కచ్చితంగా అంది స్తామన్నారు. దేశంలో ఇండియా కూటమి అత్యధిక స్థానాలు గెలు చుకుని అధికారంలోకి రాబోతుంద న్నారు. జూన్ 9న రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారన్నారు.
రాజ్యాంగాన్ని, రాజ్యాంగ సంస్థలను మోదీ ప్రభు త్వం నిర్వీర్యం చేస్తోందన్నారు. దేశంలోని మీడియాను అణచివే స్తోందన్నారు. పార్లమెంటులో(Parliment) 145 మంది ఎంపీలను సస్పెండ్ చేసి మోదీ నిరంకుశంగా వ్యవహరించా రన్నారు. న్యాయ వ్యవస్థపై ఒత్తిడి తెస్తున్నారని, కార్యనిర్వాహక వ్యవ స్థను నిర్వీర్యం చేస్తున్నారని ఆరో పించారు. మోదీ మళ్లీ గెలిస్తే ప్రజా స్వామ్యం ప్రమాదంలో పడుతుం దన్నారు. ఇండియా కూటమిలో కమ్యూనిస్టుల పాత్ర కీలకమని, తెలంగాణలో సీపీఐ, సీపీఎం మద్దతు ఇవ్వడం ఎంతో గర్వకా రణమని వ్యాఖ్యానించారు.
KCR Ghali’s words in despair