–మహిళలపై కేటీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ నల్లగొండలో దిష్టిబొమ్మ దగ్ధం
–డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్
Ketawat Shankar Naik: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: కాంగ్రె స్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల ఆర్థికాభివృద్ధి, సంక్షేమం కోసం పెద్దపీట వేసిందని డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ (Ketawat Shankar Naik) అన్నారు. మహిళలపై కేటీ ఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం నల్గొం డ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ విగ్ర హం (NTR idol)వద్ద రోడ్డుపై కేటీఆర్ దిష్టిబొ మ్మను దగ్ధం చేశారు. కెసిఆర్, కేటీఆర్ లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పదేళ్ల కెసిఆర్ కుటుంబ పాల నలో మహిళలకు మంత్రి పదవులు దక్కలేదని, మహిళా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ధ్వజమె త్తారు. బీఆర్ఎస్ పాలనలో అనేక మంది మహిళలు అవమానాలకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశా రు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై మాజీ మంత్రి కేటీఆర్ (ktr) చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని విమ ర్శించారు.
కేటీఆర్ (ktr) వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నా రు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని జీర్ణించుకో లేక బీఆర్ఎస్ పార్టీ నాయకులు నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నా రని విమర్శించారు. గత ఎంపీ ఎన్ని కల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోక పోవడంతో పాటు పలుచోట్ల డిపాజిట్ (Deposit) కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి (BRS party)ఇంకా బుద్ధి రాలేదని ఎద్దేవా చేశా రు. ఇప్పటికైనా కేటీఆర్ మహిళల పై చేసిన వ్యాఖ్యలపై బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ (demand)చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధి కారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేస్తు ముందుకు పోతుందని అన్నారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తదితర సంక్షేమ పథకాలపై (Welfare schemes)బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రజలే వారికి తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరిం చారు.ఈ కార్యక్రమంలో నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, డిసిసిబి డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గాలి నాగరాజు, పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నాంపల్లి భాగ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ నాగమణి రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు పిల్లి యాదగిరి, పుట్టా రాకేష్, మామిడి కార్తీక్,కంచర్ల ఆనంద్ రెడ్డి, జంజీరాల గిరి, పెరిక అంజయ్య, వడ్డేపల్లి కాశిరాం,రాకేష్, రంజిత్, ముజ్జు, సల్మాన్, సిద్ధార్థ,వడ్డేపల్లి మహాలక్ష్మి,నందిని,ఎల్లోరా,నిర్మల తదితరులు పాల్గొన్నారు.