Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Khammampati Shankar: గత పది నెలల మెస్ బకాయిలు విడుదల చేయాలని ‌ ముఖ్యమంత్రి కు చెప్పాలని డిమాండ్.

ఎస్ ఎఫ్ ఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్

ప్రజదీవెన, నల్గొండ టౌన్ : భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా కార్యదర్శి ఖమ్మం పాటి శంకర్‌ మాట్లాడుతూ పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకునే సంక్షేమ హాస్టల్లో గురుకులాలు, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలోమెస్ చార్జీలు పెంచిన అని చెప్పి అన్ని సంక్షేమ హాస్టల్లో గురుకులాలలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ప్రజాప్రతినిధులు విద్యార్థుల తల్లిదండ్రులతో భోజనాలు చేసిన ప్రజాప్రతినిధులకు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నల్లగొండ జిల్లా కమిటీ సూటి ప్రశ్న వేయడం జరుగుతుంది.

గొర్రె తోక బెత్తడు అన్నట్టు పేద మధ్యతరగతి విద్యార్థుల మెస్ చార్జీలు పెంచామంటూ పండగ చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు ఈరోజు సంక్షేమ హాస్టల్లో మీరు తిన్న భోజనం కూడా వసతి గృహ అధికారులు అప్పులు తీసుకొచ్చి పెట్టినదే అన్న సంగతి మర్చిపోకుండా గుర్తుంచుకొని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కి గత మార్చి నుండి ప్రస్తుత డిసెంబర్ వరకు సంక్షేమ హాస్టల్ విద్యార్థుల మెస్ కాస్మోటిక్ ఛార్జీలు విడుదల కాకుండా పేద మధ్యతరగతి విద్యార్థులు కడుపునిండా భోజనం ఏ విధంగా చేస్తారో సమాధానం చెప్పాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉంది.

హాస్టల్లో భోజనం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాప్రతినిధులు స్పెషల్ ఆఫీసర్లు తక్షణమే ప్రభుత్వం దృష్టికి సంక్షేమ హాస్టల్ లో గురుకులాల్లో విద్యార్థులకు కావలసిన మౌలిక సదుపాలపై మరియు బకాయిలో ఉన్న మెస్ కాస్మోటిక్స్ ఛార్జీల విడుదలపై మరియు వసతి గృహాల్లో గురుకుల పాఠశాలలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఉంటే పేద మధ్యతరగతి విద్యార్థులు చలికి వణికి పోతా ఉంటే కలికి తట్టుకునే దుప్పట్లు ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నామని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేయడం జరుగుతోంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పెంచిన మెనూ రెగ్యులర్గా అమలయ్యే విధంగా విద్యార్థులకు అందే విధంగా చూడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని దేవుడు విరమించిన పూజారి కరుణించలేదన్న రీతులో వసతి గృహాల్లో అధికారులు వ్యవహరిస్తే భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆందోళన హెచ్చరించారు.

గత కొన్ని సంవత్సరాలుగా శిధిలావస్థలో ఉన్న సంక్షేమ హాస్టల్ లో గురుకులాలకు తక్షణమే సొంత భవనాలు కేటాయించాలని విద్యారంగానికి 30% నిధులు కేటాయించి విద్యారంగాన్ని సంక్షేమ హాస్టల్లో వసతి గృహాలను గురుకుల పాఠశాలను కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థులకు న్యాయమైన భోజనం ఏ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉంది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పేద మధ్యతరగతి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచకుండా విద్యార్థులకు పది రూపాయలు లోపు ఒక పూట భోజనం ఏ విధంగా సాధ్యపడుతుందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమాధానం చెప్పాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది.

ప్రస్తుతం విద్యా సంవత్సరం పరీక్షల సమయం దగ్గరకు వస్తున్న నేపథ్యంతో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలంటే ప్రత్యేకంగా శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందన్నారు. సంక్షేమ హాస్టళ్లకు గురుకులాల కస్తూర్బా బాలికల పాఠశాలలకు అందించే పాలు గుడ్డు పండు చికెను టెండర్ల ద్వారా వస్తున్న నేపథ్యంతో పాడైన కుళ్ళిపోయిన కూరగాయలు తీసుకొచ్చి విద్యార్థులు అనారోగ్యం కావడానికి కారణమవుతున్నారు. తక్షణమే టెండర్ల పైన జిల్లా కలెక్టర్ స్థాయిలో నాణ్యమైన సరుకులు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టి జాగ్రత్తలు తీసుకుంటేనే జిల్లాలో గాని రాష్ట్రంలో గాని విద్యార్థులకు కాకుండా ఉంటుందని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరుగుతుందని అన్నారు.

తక్షణమే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పేద మధ్యతరగతి విద్యార్థుల పక్షాన ఆలోచించి బకాయిలో ఉన్న పది నెలల మెస్ కాస్మోటిక్స్ చార్జీలను విడుదల చేసి పేద మధ్యతరగతి విద్యార్థులు చదువులు ముందుకు పోయే విధంగా కృషి చేయాలని అన్నారు .ఈరోజు హాస్టల్లో తిన్న ప్రజాప్రతినిధులు ఈ సమస్యలను అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. లేనిపక్షంలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునివ్వడం జరుగుతుందని హెచ్చరించారు.