–పాఠశాల విద్యను అభ్యసించిన స్కూల్ లో చామల కిరణ్ సందడి
Kiran Kumar Reddy: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్లగొండలోని తాను పాఠశాల విద్యను అభ్యసించిన సెయింట్ ఆల్ఫోన్సస్ స్కూల్ ను భువనగిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ చామల్ కిరణ్ కుమార్ రెడ్డి (Kiran Kumar Reddy) శనివారం సందర్శించారు. జిల్లా పరిషత్ సమావేశంలో పాల్గొనేందుకు విచ్చే సిన కిరణ్ కుమార్ రెడ్డి (Kiran Kumar Reddy) తను చదు వుకున్న పాఠశాలను సందర్శించేం దుకు విచ్చేయగా పాఠశాల కరస్పాండెంట్ హృదయ్ కుమార్ రెడ్డి ఎంపి కిరణ్ కుమార్ రెడ్డికి (Kiran Kumar Reddy) పుష్ప గుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. నేను 2వ తరగతి నుండి 8వ తరగతి వరకు క్లాస్ టీచర్ గా (TEACHER) పని చేసినటువంటి టీచర్ కేథరిన్, హిందీ టీచర్ గులాం జిలాని ఈ సందర్భంగా ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా సన్మా నించారు.
చిన్ననాటి పాఠశాలలో జరిగిన మధుర అనుభూతులను గుర్తు చేసుకున్నారు. తమ పాఠశా లలో విద్యాభ్యాసం చేసినటువంటి విద్యార్థి పార్లమెంటు సభ్యులుగా (As Members of Parliament) గెలుపొందడం గర్వంగా ఉందని పాఠశాల యాజమాన్యం ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి పాఠశాల యాజమాన్యం అభినందించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ నాయక్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.