Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Chāḍa Kishan Reddy: బిఆర్ఎస్ కార్యాలయం జోలికొస్తే సహించబోo

–సిఎం రేవంత్ రెడ్డి మెప్పు పొందేందుకే మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు
–రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది
–మీడియా సమావేశంలో బిఆర్ఎ స్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి

Chāḍa Kishan Reddy: ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ ఆఫీ సును కూల్చేస్తామంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy Venkat Reddy) పదేపదే వ్యాఖ్యానించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి (Kishan Reddy) ఖండించారు. బిఆర్ఎస్ కార్యాలయాన్ని కూల్ చేస్తామంటూ నల్లగొండ పర్యటనకు వచ్చినప్పు డల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భయపెట్టే విధంగా అధికారులను బెదిరిస్తున్నట్లు బాహాటంగా వ్యాఖ్యలు చేయడం పరిపాటిగా మారిందని దుయ్యబట్టారు. మంత్రి స్థాయి లో ఉండి పదేపదే అవే మాటలను ఎక్కడపడితే అక్కడ వాడడం ఇక ఆపాలని హితవు పలికారు.బిఆర్ ఎస్ పార్టీ ఆఫీసు జోలికి వస్తే సహిం చబోమని కిషన్ రెడ్డి హెచ్చరించా రు. బుధవారం ఆయన నల్లగొండ లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూమి లోనే బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మించడం జరిగిందని, పార్టీ ఆఫీ సు కోసం ఏ ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నిర్మించలేదనే విషయాన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గుర్తుంచు కుంటే మంచిదని చెప్పారు.

మీ కాంగ్రెస్ పార్టీకి ఆఫీసు లేకపోతే మీరు కూడా భూమి ప్రభుత్వం నుంచి కేటాయించుకొని నిర్మించు కోండి కానీ ఇతర పార్టీ ఆఫీసుల మీద పడి కూల్చేస్తాం అనే మాటలు మాట్లాడడం సరికాదన్నారు. మేము చంద్రబాబు రేవంత్ రెడ్డి (Chandrababu Revanth Reddy)లాంటి వారి తొత్తులం కాదని, అలాంటి వారికి భయపడే ప్రసక్తే లేదని, మేమంతా తెలంగాణ ఉద్య మకారులమని, టిఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ అని, మా జోలి కొచ్చి నా, మా ఉద్యమకారుల జోలికి వచ్చినా, మా పార్టీ ఆఫీస్ జోలికి వచ్చినా ఉపేక్షించబోమని హెచ్చ రించారు. ముప్పై ఏళ్ళ పాటు ప్రత్యక్ష రాజకీయంలో ఉంటూ వస్తున్న మీరు రాజకీయంలో ఉండి నల్లగొండలో కనీసం పార్టీ ఆఫీసు నిర్మించుకోలేదని, కార్యకర్తలు మొత్తం మీ ఇంటి చుట్టూ తాబే దారులుగా తిరగాలని ఆలోచ నతోనే పార్టీ ఆఫీసు నిర్మించకుండా ఉన్నారన్నారని, రేవంత్ రెడ్డి మెప్పు పొందేందుకే బిఆర్ఎస్ పార్టీపై మాటల తూటాలు పేల్చుతున్నా రని అసహనం వ్యక్తం చేశారు.

మీరు ఏందో నల్లగొండ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలకు తెలుసని, ఆర్ఎస్ పార్టీ ఆఫీసు (RS Party Office) నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సైతం ఢిల్లీలో భూ మి ఇస్తే అక్కడ ఆఫీసు నిర్మాణం చేశామని, కానీ రాష్ట్రంలో మీరు ఎందుకు బిఆర్ఎస్ పార్టీ ఆఫీసుల మీద పడ్డారని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో మీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే ప్రయత్నం చేస్తుందని రానున్న రోజుల్లో ప్రజల నుంచి మీకు బహి ష్కరణ తప్పదని హెచ్చరించారు. వ్యక్తిగత కుట్రలు ద్వేషాలకు స్వస్తి చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెర వేర్చాలని డిమాండ్ చేశారు. ఆరు గ్యారంటీలతో పాటు రాష్ట్ర ప్రజల కు ఇచ్చిన 420 హామీలను నెరవే ర్చే దిశగా కాంగ్రెస్ పార్టీ పయనిం చాలి తప్ప టిఆర్ఎస్ పార్టీపై (TRS party) ఏడవడం సరికాదన్నారు. పదేళ్ల కాలంలో అధికారంలో ఉన్న బి ఆర్ఎస్ పార్టీ ఏ పార్టీ ఆఫీసు జోలికి వెళ్లకుండా ప్రజల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్లిన విషయం దృష్టిలో ఉంచు కోవాలని గుర్తు చేశారు. రెండు లక్ష ల రూపాయల రుణమాఫీ చేస్తా మని ప్రకటించి ఇప్పటివరకు సగం మంది రైతులకు కూడా చేయని మీరు రైతు భరోసా ఎందుకు ఇవ్వ డం లేదని ప్రశ్నించారు.టిఆర్ఎస్ పార్టీ పై విమర్శలు ఆపి ఇక రాష్ట్ర ప్రజల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని అది వీడి పార్టీ ఆఫీసును కూల్చాలని టిఆర్ఎస్ పార్టీ వాళ్లపై విమర్శలు చేయాలని ఆలోచిస్తే మాత్రం ప్రజల నుంచి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో కనగల్ పిఎసిఎస్ చైర్మన్ తోటి శ్రీని వాస్, ఎస్కే లతీఫ్, పోలే వెంకటాద్రి, కర్నాటి మల్లేష్ తదితరులు పాల్గొ న్నారు.