Koṇḍa veṅkanna: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: గీతకార్మికులకు జీవనాధారమైన తాటి, ఈత చెట్లు (Palm and swimming trees) నరికిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకో వాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కొండ వెంకన్న (Koṇḍa veṅkanna) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం నల్లగొండ పట్ట ణంలో పానగల్లు కాటమయ్య గుడి సర్వే నెంబర్ 17,18,19 లో సుమారు 120 తాటి చెట్లు 60 ఈత చెట్లను అక్టోబర్25వ తేదీన భూయజమాని అయిన కొండ లక్ష్మయ్య చెట్లను నరకడం జరిగి నది. సమాచారం తెలిసిన వెంటనే పానగల్లు కల్లుగీత కార్మిక సంఘం సొసైటీ ఆధ్వర్యంలో పరిశీలన చేసి టూ టౌన్ సిఐ నాగరాజు కు సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవా లని కార్మికులతో కలిసి వినతి ప త్రం సమర్పించడం జరిగినది.
ఈ సందర్భంగా కొండ వెంకన్న (Koṇḍa veṅkanna) మాట్లాడుతూ తాటి చెట్లు, ఈత చెట్లు గీసుకొని వాటిపైనే ఆధార పడి బ్రతుకుతున్న సుమారు60 కల్లుగీత కార్మిక కుటుంబాలు జీవ నోపాధిని (Jiva Nopadhi) కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి సమాచారం లేకుండా చెట్లు నరికిన సదరు వ్యక్తి పైన క్రిమినల్ చర్యలు తీసుకోనీ ప్రతి కుటుంబానికి లక్ష రూపాయలు నష్టపరిహారం చెల్లిం చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్ర మంలో పానగ ల్ గీత కార్మిక సంఘం సొసైటీ అధ్యక్షులు జెర్రిపోతుల యాద య్య, ప్రధాన కార్య దర్శి గుండగోని జానయ్య ఉపాధ్య క్షులు గుండెగో ని సత్తయ్య నాయ కులు కొప్పుల సత్తయ్య, ఉయ్యాల జానయ్య, జానకి రాములు, ఉ య్యాల సైదులు, రావుల నాగ య్య, మీనయ్య, గుండగొని వెం కన్న, గుండెగోని రాజు, కసగోని సైదులు, గుండెగోని శ్రీను, పోగుల బిక్షమయ్య తదితరులు పాల్గొ న్నారు.