ప్రజాదీవెన, నల్గొండ టౌన్ :నల్గొండ జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయము ముందు తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ పదకొండవ రోజు నిరవధిక సమ్మె ఉదృతంగా కొనసాగుతుంది. విద్యాశాఖలోని సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులుగా రాష్ట్రవ్యాప్తంగా 19300 మంది నల్గొండ జిల్లాలో దాదాపుగా 1100 మంది వివిధ విభాగాలుగా పనిచేస్తున్నారు. గత 20 సంవత్సరాలుగా విద్యాశాఖ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. సరైన వేతనాలు అందక ఇబ్బంది పడుతున్నారు. బోనాలతో ర్యాలీ తీసి పోతరాజుల ఆట ఆడి నిరసన తెలిపారు. అదే విధంగా రాష్ట్ర మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కు వినతి పత్రం ఇచ్చి సమస్యలు పరిష్కరించాలని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆవేదన వినాలని, రెగ్యులర్ చేస్తానని హామీ ఇచ్చి మౌనంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే మాకు న్యాయం చేయాలని లేని యెడల సమ్మె ఉధృతం చేస్తామని తెలిపారు.
గత సంవత్సరం వీరు చేసిన నిరసన కార్యక్రమాలకు 13.09.2023 న హన్మకొండ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు విద్యా శాఖ లోని సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల అందరిని రెగ్యులర్ చెయ్యాలని ఆ లోపు తక్షణమే పే స్కెల్ అమలు చెయ్యాలని డిమాండ్ చేశారు.20 సంవత్సరాలుగా అతి తక్కువ వేతనాలతో శ్రమ దోపిడీకి గురి అవుతున్నామని, మా విలువైన జీవిత కాలం మొత్తం ప్రభుత్వాలు దోచుకున్నాయని, పెరిగిన నిత్యావసర ధరల వలన బ్రతకలేక చస్తున్నామని ఆవేదన, భారత దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం వెంటనే అమలు చెయ్యాలని వేడుకుంటున్నారు.జిల్లాలో ఉన్న 1111 ఉద్యోగులు ఈ కార్యక్రమానికి ప్రతిరోజు హాజరవుతూ ప్రభుత్వం హామీ ఇచ్చేవరకు మా నిరవధిక దీక్షను ఇలాగే కొనసాగిస్తామని సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మొలుగూరి కృష్ణ మరియు బొమ్మగాని రాజులు తెలిపారు.
ఈ కార్యక్రమ నిర్వాణాలు రాష్ట్ర ప్రతినిధులుగా రాష్ట్ర అసోసియే ప్రెసిడెంట్ క్రాంతికుమార్, రాష్ట్ర కార్యదర్శి కంచర్ల మహేందర్, సలహాదారులు ఎమ్. నీలాంబరి పాల్గొన్నారు. మహిళా ఉద్యోగులు అత్యధిక సంఖ్యలో పాల్గొని సమ్మెకు సంఘీభావం తెలియజేయడం జరిగింది. సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కొండ చంద్రశేఖర్, మహిళా అధ్యక్షురాలు గుమ్మల మంజులారెడ్డి, మహిళా కార్యదర్శి సావిత్రి, అసోసియేట్ ప్రెసిడెంట్ వి. సావిత్రి , కోశాధికారి పుష్పలత గారు, సాయిల్, ఉపాధ్యక్షులు వెంకట్, జి వెంకటేశ్వర్లు,ఎర్రమల్ల నాగయ్య, ప్రచార కార్యదర్శి చందపాక నాగరాజు,బంటు రవి, లలిత, కొండయ్య, యాదయ్య, యాట వెంకట్, జి వెంకటేశ్వర్లు,ధార వెంకన్న, శ్రీనివాస్, వి రమేష్, వసంత, సుజాత, నిరంజన్, వెంకటకృష్ణ, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.
సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఉపాధ్యాయ సంఘాలు మరియు రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి.
కలెక్టర్ ఆఫీస్ ముందు జరిగిన సమ్మెకు వివిధ ఉపాధ్యాయ సంఘాలు మరియు వివిధ రాజకీయ పార్టీలు,ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు నూనె వెంకట స్వామి టిపియుఎస్ జిల్లా అధ్యక్షులు ఇరుగు శ్రీరాములు, ఎస్ వి ప్రసాద్, పాపి రెడ్డి, టౌన్ ప్రధాన కార్యదర్శి బి యాదయ్య , శ్రీ రామ్ నాయక్, రాజశేఖర్ హాజరై మద్దతు తెలిపారు.