— రైతులకు, ప్రభుత్వానికి అనుసం ధానంగా మార్కెట్ కమిటీలు
–రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమా టోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
Komati Reddy Venkat Reddy; ప్రజా దీవెన, దేవరకొండ: వ్యవసా య మార్కెట్ కమిటీలు రైతులకు మేలు చేసేవిగా ఉండాల ని రాష్ట్ర రోడ్లు ,భవనాలు, సినిమా టోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంక టరెడ్డి Komati Reddy Venkat Reddy) అన్నారు. రైతులకు, ప్రభు త్వానికి అనుసంధానంగా ఉండేదే వ్యవసాయ మార్కెట్ కమిటీ (Agricultural Market Committee) అని చెప్పారు. సోమవారం అయన నల్గొండ జిల్లా, దేవరకొండ నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమా ణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
నూతనంగా ఎంపికైన వ్యవసాయ మార్కెట్ కమిటీ రైతులకు మేలు చేయడమే ధ్యేయంగా పెట్టుకోవా లని అన్నారు. తమ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం అని, దేవరకొండ ప్రాంతం తో పాటు, నల్గొండ జిల్లాకు సాగునీరు అందించడమే కాకుండా, అన్ని గ్రామాలకు డబుల్ రోడ్డు వేయాలన్నదే తమ ధ్యేయమని తెలిపారు . దేవరకొండ, మునుగోడు, నకిరేకల్,నాగార్జున సాగర్ నియోజకవర్గాలతో పాటు, జిల్లాలోని అన్ని నియోజకవర్గాలను సస్యశ్యామలం చేసేందుకు 2005 నుండి ఎస్ఎల్బీసీ సొరంగం ద్వారా సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామని, 40 కిలోమీటర్ల సొరంగం పనులు పూర్తికాగా, ఇంకా 9.5 కిలోమీటర్ల మిగిలిందని, గత ప్రభుత్వం ఎస్ఎల్బీసీ పనులను పెండింగ్లో ఉంచగా తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పట్టుబట్టి నిధులు కేటాయించి అమెరికా నుండి మిషన్ రిపేరీకి మార్గం సుగమం చేయడమే కాకుండా, నవంబర్ ,డిసెంబర్లో రెండు మిషన్ల ద్వారా పనులు ప్రారంభించి 30 నెలల్లో పూర్తి చేసి సాగునీరు అందిస్తామని అన్నారు. తమ ప్రభుత్వం 18వేల మంది రైతులకు రెండు లక్షల రుణాలను మాఫీ చేసిందని, రెండు లక్షల పైన రుణాలు ఉన్న వారికి కూడా రుణ మాఫీ చేస్తామని ఆయన చెప్పారు. వారంలో అన్ని నియోజకవర్గాలలో, నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇవ్వనున్నామని, 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇండ్లు కట్టించనున్నామని తెలిపారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం (Free bus travel_కింద నెలకు 200 కోట్లు ఖర్చు చేస్తున్నామని, 500 రూపాయలకే ఎల్పిజి కనెక్షన్ ఇస్తున్నామని, పది నెలల్లో 60000 ఉద్యోగాలు ఇచ్చామని, మాల్ వద్ద స్కిల్ యూనివర్సిటీని నిర్మిస్తున్నామని తెలిపారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వర్గాల విద్యార్థులకు ఇంటిగ్రేటెడ్ హాస్టల్లు నిర్మిస్తున్నామని ,8 నెలల్లో వీటిని పూర్తి చేయబోతున్నామని తెలిపారు. మూసి వల్ల రోగాల పాలవుతున్న ప్రజలను రక్షించేందుకు తమ ప్రభుత్వం మూసి ప్రక్షాళనకు నడుం బిగించిందని, ఇందులో భాగంగానే మూసిలో ఇల్లు కూలిపోయిన బాధితులకు ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. రాష్ట్రంలో ప్రతి గ్రామానికి ఆర్ఆర్బీ రహదారులు వేస్తామని, అందులో భాగంగానే నల్గొండ జిల్లాకు ఆర్ అండ్ బి ద్వారా 516 కోట్ల రూపాయలు కేటాయించమని తెలిపారు. మండల కేంద్రం నుండి జిల్లా కేంద్రానికి బీటి రోడ్లు వేస్తామని ,మాల్, మర్రిగూడను కింది నుండి 30 వేల కోట్ల రూపాయలతో రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణాన్ని చేపడుతున్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.
సమావేశానికి అధ్యక్షత వహించిన దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్ (Devarakonda legislator Balu Naik)మాట్లాడుతూ ఈ ప్రాంత రైతులకు సాగునీరు అందించడమే తమ అధ్యయనంఅని అన్నారు. నియోజకవర్గంలోని అన్ని రహదారులను పూర్తిచేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. అంగడిపల్లి- పీఏ పల్లి రహదారికి లైనింగ్ చేసి రహదారి నిర్మాణాన్ని పూర్తిచేయాలని ఆయన మంత్రకి విజ్ఞప్తి చేశారు. నాగార్జునసాగర్ శాసనసభ్యులు జయవీర్ రెడ్డి మాట్లాడుతూ తమ ప్రభుత్వం రైతులకు అండగా ఉండే ప్రభుత్వమని, అన్ని విషయాలలో తాము రైతులకు న్యాయం చేస్తామని ,నూతనంగా ఎంపికైన వ్యవసాయ మార్కెట్ కమిటీకి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.
నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఎంపికైన జమున మాధవరెడ్డి (Jamuna Madhav Reddy) మాట్లాడుతూ మార్కెట్ కమిటీ చైర్మన్ గా రైతుల సంక్షేమం కోసం తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు. మాజీ శాసనసభ్యులు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి జె శ్రీనివాస్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్వయ్య యాదవ్ , తదితరులు మాట్లాడారు. కాగా నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం చేత జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారిని ఛాయాదేవి ప్రమాణ స్వీకారం చేయించారు. దేవరకొండ మున్సిపల్ చైర్మన్ లక్ష్మయ్య, జిల్లా డీసీసీ బ్యాంక్ అధ్యక్షులు కుంభం శ్రీనివాస్ రెడ్డి, ఆర్డిఓ శ్రీరాములు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.