Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Komati Reddy Venkat Reddy: బుల్లి బైక్ పై ఆకర్షణీయంగా మంత్రి కోమటిరెడ్డి

–ఫాగింగ్ కు అనువైన బుల్లి బైకును రెడీ చేసిన యువకులు

Komati Reddy Venkat Reddy: ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలో గడచిన రెండు రోజు లుగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy Venkat Reddy)సుడిగాలి పర్యటన నిర్వ హించారు. ప్రజాదర్బార్ నిర్వహిస్తూ ప్రజల సమస్యలు పరిష్కరిస్తు న్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాప నలు, ప్రారంభోత్సవాలు చేస్తూ బీజీ బీజీగా గడుపుతు న్నారు. మరోవై పు ఇదిగో ఇలా బుల్లి బైకును(Bully bike) స్వయంగా నడిపి కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. వర్షాకాలం కావ డంతో దోమలబె డద పెరిగింది.

దీంతో నిత్యం ప్రజలు దోమలు మం దు కొట్టించాలని స్థానిక కౌన్సిలర్లను కోరుతున్నారు. ఉన్నంతలో ప్రయ త్నం చేసినా అనుకున్నంత దోమల బెడద( Mosquitoes are a nuisance) తగ్గడం లేదనుకున్న 19వ వార్డు కౌన్సిలర్ కుమారుడు గోగుల గణేష్ మరియు వార్డులోని యువ కులు కలిసి ఏకంగా దోమల నివా రణ కోసం అనువుగా ఉండే ఫాగిం గ్ మిషన్ తో కూడిన బుల్లి బైకును రెడీ చేసిండు.తమ అభిమాన నాయకుడు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ పర్యటనలో ఉండటంతో మంత్రి చేతుల మీదు గా ప్రారంభం చేయించాలని గణేష్, వార్డు యువకులంతా మంత్రి క్యాం పు కార్యాలయానికి వచ్చి మంత్రికి విషయం వివరించారు.

వార్డులోని చిన్న చిన్న గల్లీల్లో కూడా ఫాగింగ్ కు అనువుగా ఉండేలా బుల్లి బైకు ను రెడీ చేశామని, ఫాగింగ్ మిషన్ లో (Fogging mission) ఒక్కసారి కెమికల్ నింపి ఆన్ చేస్తే వార్డంత కవర్ చేసుకునేలా ఫాగింగ్ మిషన్ ఉందని వారు మంత్రికి వివరించారు.కాంగ్రెస్ కార్య కర్తల చొరవను చూసి సంతోషం వ్యక్తం చేసిన మంత్రి స్వయంగా ఈ బుల్లి బైకు( Bully bike) ను నడిపి కార్యకర్తల్లో, వార్డు ప్రజల్లో జోష్ ను నింపారు. అంతేకాదు, ఇంత మంచి ఆలోచన చేసిన గణేష్ తో పాటు కార్యకర్తల ను ప్రత్యేకంగా అభినందించారు. స్వయంగా మంత్రే బుల్లిబైక్ నడుపు తూ గల్లీ ప్రజల యోగక్షేమాలు అడి గి తెలుసుకోవడంతో ఇప్పుడు ఈ బుల్లి ఫాగింగ్ బైక్ నల్గొండలో స్పెషల్ అట్రాక్షన్ గా మారింది.