Komati Reddy Venkat Reddy:–పంద్రాగస్టు లోపే రుణమాఫీకి మంత్రివర్గం ఆమోదం హర్షనీయం
–రైతు భరోసా పై కూడా త్వరలోనే ప్రభుత్వ నిర్ణయం
–మిషన్ భగీరథ అవాంతరాలు తొలగించేందుకు అధికారులు గ్రామాల్లో పర్యటించాలి
–నల్లగొండ జడ్పీ చివరి సమావేశం లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
ప్రజా దీవెన, నల్లగొండ: రాజకీ యాలకతీతంగా నల్గొండ జిల్లా అభివృద్దే ధ్యేయంగా అందరూ కలిసి పనిచేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమా టోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkat Reddy)పిలుపు నిచ్చారు. శనివారం నల్గొం డ జిల్లా పరిషత్ సమావేశ మంది రంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ బండా నరేందర్ రెడ్డి (Narender reddy)అధ్యక్షతన నిర్వహించిన జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజర య్యారు. మిషన్ భగీరథ, వ్యవసా యం, విద్యుత్, విద్య తదిత అంశా లపై జిల్లా పరిషత్ సర్వసభ్య సమా వేశం చర్చించింది. కాగా జూలై 4 తో ప్రస్తుత జిల్లా పరిషత్తు కాలపరిమి తి ముగియనునందున శనివారం నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వస భ్య సమావేశానికి సభ్యులందరూ పెద్ద ఎత్తున హాజరయ్యారు. ముం దుగా సమావేశానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ బండా నరేందర్ రెడ్డి అధ్యక్షత వహించి మాట్లాడుతూ గత 5 సంవత్స రాలు ఏలాంటి ఒడిదు డుకులు లేకుండా జిల్లా పరిషత్తు కార్యక్రమాలను, సమా వేశాలను సజావుగా నిర్వహిం చడంలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియ జేశారు. మిషన్ భగీరథ పై (mission bhagiratha)జరిగిన చర్చ సందర్భంగా రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (komati Reddy Venkat Reddy) మాట్లాడుతూ ప్రతి ఇంటికి మిషన్ భగీరథ తగు నీరు వచ్చేలా చూడాలని, ఇందుకు మిషన్ ఇంజనీరింగ్ అధికారులు గ్రామా లలో తిరిగి సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించాలని, అవసర మైతే శాసనసభ్యుల నిధుల ద్వారా చిన్నచిన్న సమస్యలను అధిగమిం చాలని సూచించారు. వ్యవసాయం పై జరిగిన చర్చలో ఆయన పాల్గొం టూ ఆగస్టు 15లోగా రాష్ట్రంలో సుమారు 31 వేల కోట్ల రూపాయ లను రైతుల రుణమాఫీ చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించినట్లు వెల్లడించారు.
అదేవిధంగా రైతు భరోసా పై (rythu Barosa)సైతం త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని, 2 లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసింది గతంలో ఏ ప్రభుత్వం లేదని అన్నారు.విద్యుత్ పై జరిగిన చర్చ సందర్భంగా సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు తదితర వాటికోసం ఇదివరకే జిల్లాకు 11 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, ఇటీవల మరో 7 కోట్ల రూపాయలు రానున్నాయని, ఎక్కడైనా ట్రాన్స్ఫార్మర్లు, ఓవల్లోడు సమస్యలను తమ దృష్టికి తీసు కువస్తే వెంటనే వాటిని పరిష్కరి స్తామని తెలిపారు. అలాగే అడిషనల్ బడ్జెట్ ను ప్రతిపా దించాలని విద్యుత్తు ఎస్ ఈని ఆదేశించగా, అదేవిధంగా విద్యుత్ సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని సభ్యులతో కోరారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని అవసరమైన చోట సబ్ స్టేషన్ లను ఏర్పాటు చేసే విధంగా విద్యుత్ అధికారులు దృష్టి సారించాలని సూచించారు. ఇరి గేషన్ అంశంపై మంత్రి మాట్లాడు తూ జిల్లాలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నింటిని పూర్తి చేయడమే తమ ధ్యేయమని, జిల్లాలో ఉన్న పంచాయతీ రోడ్లన్నింటిని ఆర్ అండ్ బి రోడ్లుగా మార్చడం జరిగిందని, అదేవిధంగా సబ్ స్టేషన్లు, ప్రాజెక్టులను పూర్తి చేస్తామని వెల్లడించారు. పార్టీలక తీతంగా ప్రతి ఒక్కరు పని చేయా ల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశా రు.శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ మిషన్ భగీరథకు సంబంధించిన పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లింపు లపై అధికారులు స్పష్టత నివ్వాలని అన్నారు. జిల్లాలో రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరె డ్డి, సాగునీటి ప్రాజెక్టుల మంత్రిగా ఉమ్మడి జిల్లాకు చెందిన ఉత్తంకు మార్ రెడ్డిలు ఉన్నందున జిల్లాలో పెండింగ్ లో ఉన్న గొట్టిముక్కల, సింగరాజుపాలెం పెళ్లిపాకుల రిజ ర్వాయర్లు పిల్లాయిపల్లి, ధర్మా రెడ్డి రిజ ర్వాయర్లు, కెనాల్లాను పూర్తి చేయడానికి చొరవ చూపాలని మం త్రిని కోరారు. ప్రజా సమస్యల పరి ష్కారమే ధ్యేయంగా సమిష్టిగా జిల్లా అభివృద్ధికి కృషి చేద్దామని ఆయన పిలుపునిచ్చారు.నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం మాట్లాడుతూ జిల్లాలో సరిపోయి నన్ని ఎరువులు, విత్తనాలు ఉన్నా యని ,అయితే ఆయా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు సరైన విధంగా ముందే ప్రతిపాద నలు రూపొం దించుకొని సమస్య లు లేకుండా చూసుకుంటే సరిపో తుందని తెలిపారు. మిర్యాలగూడ శాసనస భ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడు తూ రాష్ట్రప్రభుత్వం రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్తు ఇస్తున్న దని, అంతేకాక రైతు రుణమాఫీ, రైతు భరోసా తో సహా ఇతర హామీలన్నీటిని నెరవేర్చినందుకు ముందు కెళ్తున్నట్లు తెలిపారు. తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు మాట్లాడుతూ తన నియోజకవర్గం పరిధిలోకి వచ్చే శాలిగౌరారం తదితర మండలాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది పనితీరును మెరుగుపరుచుకోవాలని, పంచాయతీరాజ్ రోడ్లు కొన్ని చోట్ల కంకర తేలి ఉన్నాయని వాటిని బాగు చేయాలని, జాతీయ రహదారి నుండి ఇరుకులపాడు రోడ్డు పనులను వెంటనే ప్రారంభించాలని, శాలిగౌరారం చెరువు కట్టను పటిష్టం చేసే పనులు చేపట్టాలని కోరారు.
దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్ (Balu Nayak)మాట్లాడుతూ విద్యుత్ సమస్యలను అధిగమించేందుకు ప్రతి నియోజకవర్గానికి రెండు కోట్ల రూపాయలు ఇప్పించే విధంగా మంత్రి చొరవ చూపాలని ,అలాగే విద్యుత్ లైన్ల మార్పుకు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. శాసనమండలి సభ్యులు నర్సిరెడ్డి మాట్లాడుతూ నువ్వుల్టేజ్ సమస్యలు విద్యుత్ సమస్యలు అన్నింటిని సరైన విధంగా అంచనా వేసి వెంటనే వాటిని తీర్చేందుకు చర్యలు తీసుకోవాలని, పాఠశాలలకు సంబంధించి మన ఊరు- మనబడి లో చేపట్టి మధ్యలో ఆగిపోయిన పనులను పూర్తిచేయాలని, ప్రతి పాఠశాలకు పారిశుధ్యం, శుభ్రపరిచేందుకు సిబ్బందిని నియమించాలని, వి ద్యుత్ బిల్లులు, శానిటేషన్ కు స్కూల్ గ్రాంట్ మంజూరు చేయాలని, కేజీబీవీ సమర్థవంతంగా పనిచేసేందుకు చర్యలు చేపట్టాలని కోరారు .ఈ సందర్భంగా పలువురు జడ్పీటీ సీలు, ఎంపీపీలు మాట్లాడుతూ గ్రామాలలో ఉన్న చిన్న చిన్న సమ స్యలను పరిష్కరించాలని సమా వేశం దృష్టికి తీసుకువచ్చారు. కాగా సమావే శానికి హాజరైన జడ్పిటిసి లు ఎంపీపీ లను రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిలు శాలువా, జ్ఞాపకాలతో సన్మానించారు.
భువనగిర పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సి.నారాయ ణరెడ్డి, అదనపు కలెక్టర్ జె. శ్రీనివా స్ ,జెడ్పిసిఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, డిప్యూటీ సీఈవో శ్రీనివాస రావు, జెడ్పిటిసిలు, ఎంపీపీలు, జిల్లా స్థాయి అధికారులు, తదిత రులు ఈ సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు.