–మీడియా పట్ల అపారమైన గౌర వంతో నడుచుకుంటా
–రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
Komati Reddy Venkat Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: సమాజంలో దినపత్రికలు, వార్తాఛా నెళ్లు అంటే తనకు అపారమైన గౌరవం ఉందని రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy Venkat Reddy) తెలిపారు. అదే సంద ర్భంలో ఒకటి రెండు పార్టీల సొంత పత్రికలు పనిగట్టుకొని కాంగ్రెస్ ప్ర జాప్రభుత్వంపై, మంత్రులపై సత్య దూరమైన వార్తలు రాస్తూ శునకా నందం పొందుతున్నాయని ఆగ్ర హంవ్యక్తం చేశారు.పత్రికలు (Newspapers ప్రభు త్వానికి, ప్రజలకు నడుమ సమా చార వారధులుగా ఉండాలి తప్పి తే ప్రజల్లో అపోహలు సృష్టించే విధంగా కొందరిని సంతృప్తిపరిచే వార్తలు రాయడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల ఒక పత్రికలో తాను హెలి కాప్టర్ (Helicopter) అడిగినట్టు అధికారులు వద్దన్నట్టు అసలు జరగని సంఘ టనను జరిగినట్టు వార్తరాసి అదొక పార్టీ కరపత్రిక అని చెప్పకనే చెప్పిందని, సదరు పత్రిక వంత పాడుతున్న పార్టీ మీద ఎవరైనా విమర్శలు చేస్తే, వారు ప్రజలకు చేసిన ద్రోహచర్యలను ప్రజల ముం దు పెడితే ఈ పత్రిక తననే తిట్టిన ట్టు భావిస్తూ భరించలేని వేదనతో ప్రభుత్వంపై అసత్యాలు, అర్ధస త్యాలు రాస్తూ రాక్షసానందం పొం దుతున్నదని ఆయన ఆరోపిం చారు. ముఖ్యమంత్రి, మా మంత్రి వర్గ సహచరులకు మధ్య లేని దూ రాన్ని పెంచాలని ఆ పత్రిక చేస్తున్న వెకిలి చేష్టలను ప్రజలంతా గమని స్తున్నారని, రాచరికాన్ని, నియం తృత్వాన్ని ప్రజాస్వామ్యమని భావించే ఆ పత్రిక నిజమైన ప్రజా స్వామ్యం చూసే సరికి నిద్రకరువై పెడబొబ్బలు పెడుతున్న విషయం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
మిగతా మీడియా మిత్రులు ఇలాం టి తప్పుడు పత్రికల పట్ల, రాజకీ య ప్రేరేపిత కరపత్రాల పట్ల జాగ్ర త్తగా ఉండాలని, రాజకీయ పార్టీల జెండాలు మోసే కార్యకర్తలను దయచేసి జర్నలిస్ట్ లుగా పరిగ ణించవద్దని సూచించారు. జరగని సంఘటనను జరిగినట్టు తప్పుడు కథనం రాసిన పత్రిక గత ప్రభుత్వ హయాంలో హెలికాప్టర్ ను విరి విగా దుర్వినియోగం చేసిన విష యం సదరు పత్రిక మర్చిపోవడం బాధాకరమన్నారు. మొన్నటికీ మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్ని కల్లో 16 కు 16 స్థానాల్లో ఓడిపో వడమే కాదని, ఎనిమిది స్థానాల్లో మూడో స్థానానికి పరిమితం కావ డం వెనుక ఇలాంటి కుత్సిత రాజ కీయాలు ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు. అదే సందర్భంలో ఫోన్ ట్యాంపింగ్ కు పాల్పడ్డ ప్రభాకర్ రావును (Prabhakar Rao)అమె రికాకు పంపిన విషయం, ఆ తర్వాత క్రమంలో హరీష్ రావు, కేటీఆర్ లు అమెరి కాకు పోయి ప్రభాకర్ రావును దేశంలో అడుగుపెడితే తీవ్రపరి ణమాలు ఉంటాయని హెచ్చరిం చిన విషయాన్ని సదరు పత్రిక ఎందుకు తెలుసుకోలేకపోయిందో ప్రతి ఒక్కరికి తెలసిందే అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ పత్రిక వంతపాడుతున్న ఇంట్లో జరుగుతున్న రాజకీయ రణరంగం గురించి ఏనాడు పల్లెత్తు మాట మాట్లాడని పత్రిక నెంబర్-2 స్థానం ఇవ్వకుంటే బీజేపీకి వెళ్తానని కేసీఆ ర్ ను బెదిరిస్తున్న హరీష్ రాజకీయ బ్లాక్ మెయిల్ గురించి చెబితే బావుండేదని వ్యాఖ్యానించారు.
ఒక పక్క మేం రైతులకు 18 వేల కోట్ల రూపాయల రైతురుణమాఫీ చేసి రైతుల కళ్లలో ఆనందం చూ స్తుంటే, పచ్చని ప్రభుత్వంలో చిచ్చు లు పెట్టి వాళ్ల యజమాని కళ్లలో ఆనందం చూస్తున్న సదరు పత్రిక ఏ జర్నలిజం విలువలకు పట్టం కడుతుందో ప్రజలు తెలుసుకోలే నంత అమాయకులేం కాదన్నారు. రాష్ట్రంలో ప్రజలు ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీలో ప్రజల పక్షాన, ప్రజ ల సమస్యలపై గొంతెత్తి పోరాడా ల్సిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు నెలలు నెలలుగా ఫాంహౌజ్ (Farmhouse) కు పరి మితమైన సంగతిని పిడికిలెత్తి ప్రశ్నించాల్సిన ఆ పత్రిక అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం ప్రజ ల్ని విస్మయానికి గురి చేస్తున్నదని చెప్పారు.కేవలం మా ప్రభుత్వం మీద లేనిపోని కల్పిత కథనాలను ప్రచురించడం ఏ గుణాత్మక మా ర్పులకు తార్కాణమని ప్రశ్నిం చారు. ప్రతిపక్షాన్ని ప్రజలు ఛీకొ డుతున్న సంగతి ప్రతీ ఎన్నికలు గంభీరంగా రుజువు చేస్తున్న సంద ర్భంలో ఆ వ్యతిరేకత నుంచి తప్పించుకునేందుకు ఇలాంటి కల్పిత కథనాలు ప్రచురించడం “దేశరాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చినట్టే” ఉందని ఎద్దేవా చేశారు. కేంద్రం తెలంగాణ కు చేస్తున్న అన్యాయాలమీద “అగ్గి రాజేయాల్సిన” సందర్భంలో ఆనా డు అగ్గిపెట్టే దొరకలేదని తప్పించు కున్నట్టే ఈనాడు బెయిల్ కోసం అక్కడే “మోకరిల్లి” సొమ్మసిల్లి పడిపోవడం ఏ వీరత్వ లక్షణమో ప్రజలు తెలుసుకోలేక తికమకపడు తున్న సందర్భంలో సదరు పత్రిక కులంకుషంగా, వివరాణాత్మకంగా ఒక పూర్తిస్థాయి బులెటెన్ విడు దల చేయాల్సిన సందర్భంలో తెల్లా రితే ప్రజలతో మమేకం అయ్యే మాలాంటి నాయకులపై అవాకులు చెవాకులు పేలడం బాధాకరమ న్నారు.
మాకు “గజకర్ణ.. గోకర్ణ.. టక్కు టమారా విద్యలు” రావు.. మాకు తెలిసింది కేవలం సాయం కోసం వచ్చిన వారికి, ఆపద అం టూ వచ్చిన ప్రజలకు అండగా ఉండటమే, మీ రాజ్యాంగంలో అదికూడా తప్పంటే మేం చేయ గలిగిందేం లేదని అన్నారు. మా ముఖ్యమంత్రి నాయకత్వంలో మంత్రులందరం ఒక టీంలా (team) కలిసి పనిచేస్తున్నామని, మా మధ్య ఎక్కడా పొరపొచ్చాలు లేవని, ఈ కల్పిత కథనాల వలన ఎప్పుడు మా మాధ్య దూరం పెరిగే అవకా శమూ లేదని స్పష్టం చేస్తూ మీ ఉత్సహాన్ని ప్రజల సమస్యలను వెలుగులోకి తెచ్చి ప్రజలకు మంచి చేసేందుకు ప్రయత్నిస్తే మీకే మం చిదని హితవు పలికారు. ఇలాంటి తప్పుడు కథనాలు మరోసారి రాకుండా దయచేసి మానుకుంటే సదరు పత్రికకు, వారి యాజమా న్యానికి మంచిదని, మీ సొంతపార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీవీల ను, పత్రికలను బ్యాన్ చేసిన రీతి గా వ్యవహరించడం మాకు తెలియక కాదు, ప్రజాస్వామ్యం పట్ల అపారమైన గౌరవమర్యాదలు కలిగిన మా పార్టీ సిద్ధాంతం, మా రాజకీయ విధానాలకు కట్టుబడి మేము, మా పార్టీ కార్యకర్తలు సంయమనం పాటిస్తున్నామ న్నారు. మా మంచితనాన్ని, మాన వత్వాన్ని, ప్రజాస్వామ్య వైఖరుల ను చేతగానితనంగా భావించ వద్దని, ఇలాంటి తప్పుడు కథ నాలు, అభూతకల్పనలు సృష్టించే వార్తలు మా కార్యకర్తల ఓపికను, సహనాన్ని హరించివేస్తే తర్వాత జరిగే పరిణామాలకు మా బాధ్య తకాదని హెచ్చరించారు.