Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Komati Reddy Venkat Reddy: టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సంజీవ్ కుమార్ కు ఉద్యోగుల చేయూత

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతులతో రూ. 5 లక్షల సాయం

Komati Reddy Venkat Reddy: ప్రజా దీవెన,నల్లగొండ టౌన్: ఉపాధి హామీ పథకం టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగుల సంఘం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సంజీవ్ కుమార్ (Sanjeev Kumar) కు ఉద్యోగులంతా అండ గా నిలిచి చేయూతనందించారు. గత రెండు నెలల క్రితం నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన సంజీవ్ కుమార్ అనారోగ్యంతో మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగులంతా మృతి చెందిన సంజీవ్ కుమార్ కుటుంబానికి అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఉద్యోగులంతా కలిసి తమ వేతనం ద్వారా మొత్తం రూ.5 లక్షల వసూలు చేశారు. బుధవారం హైదరాబాదులో రాష్ట్ర రోడ్లు ,భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy Venkat Reddy) గారి నివాసానికి వెళ్లి ఆయన చేతుల మీదుగా సంజీవ్ కుమార్ కుటుంబానికి రూ. 5 లక్షల చెక్కును అందజేశారు.

ఈ సందర్భంగా సంజీవ్ కుమార్ Sanjeev Kumar) యొక్క కుమారునికి ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడడంతో పాటు పేస్కేల్ అంశాన్ని ఉద్యోగులంతా మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. మంత్రి వెంటనే స్పందించి ఈనెల 21న సెక్రటేరియట్ లో కలవాలని సూచించారు. పే స్కేల్ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అయ్యే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు.

అనారోగ్యంతో మృతి చెందిన సంజీవ్ కుమార్ Sanjeev Kumar) కు ఉద్యోగులంతా కలిసి అండగా నిలిచి రూ. 5 లక్షలు అందజేయడం అభినం దనీయమన్నారు.ఈ కార్యక్రమంలో TNGO మాజీ అధ్యక్షులు ఏడుదొడ్ల వెంకటరామ్ రెడ్డి, TGO మాజీ అధ్యక్షులు గోన మోహన్ రావు, ఉపాధి హామీ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లింగయ్య, కో- చైర్మన్ అంజి రెడ్డి, విజయకుమార్ , వెంకటరామిరెడ్డి నరసింహ చారి, శ్రీనివాసరా వు ,జగన్, కృష్ణ రేణుకతో పాటు అన్ని జిల్లాల అధ్యక్షులు, 100 మంది పాల్గొన్నారు