Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Komati Reddy Venkata Reddy: నల్లగొండ సర్వోత్తముఖాభివృద్ధికి సబ్బండ వర్గాల సహకారం

— స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Komati Reddy Venkata Reddy: ప్రజా దీవెన, నల్లగొండ: నల్గొండ జిల్లా సర్వోత్తముఖాభివృద్ధికి అంద రి సహకారం అవసరమని రాష్ట్ర రో డ్లు, భవనాలు, సినిమా టోగ్రఫీశా ఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata Reddy) అన్నారు.78వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా గురువారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానం లో జాతీయ పతాకాన్ని ఎగురవేసి పోలీసు గౌరవ వందనం స్వీకరిం చారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రభుత్వం అమలు చేస్తు న్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్ర మా లపై సందేశం ఇస్తూ ప్రజా సమస్య ల పరిష్కారంలో ముందుండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటైన 48 గంటలలోనే ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను (Six guarantees)తమ ప్రభుత్వం అ మలు చేసిందని అన్నారు.ఇందులో భాగంగా మహాలక్ష్మి పథకం కింద జిల్లాలో రెండు కోట్ల 27 లక్షల మం ది మహిళలు ఉచిత బస్సు ప్రయా ణ సౌకర్యాన్ని వినియోగించుకు న్నారని, ఇందుకు ఆర్టీసీ కి 98 కోట్ల 26 లక్షల రూపాయలు లబ్ధి పొం దిందని తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద పరిమితిని 5 నుండి 10 లక్షల కు పెంచడం జరిగిందని, దీని ద్వారా జిల్లాలో 33 వేల 312 మంది చికిత్సలు చేయించుకొని లబ్ధి పొందగలిగారని తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్ల (Indiramma houses)నిర్మాణంలో భాగం గా ప్రతి నియోజకవర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేయనున్నామని, 3500 చొప్పున జిల్లాలో మొత్తం 21 వేల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించనున్నామని తెలి పా రు. 500 రూపాయలకే ఎల్పీజీ సిలిండర్ పథకం కింద రెండు లక్షల 38వేల 251 మందికి నాలుగు లక్ష ల ఇరవై మూడు వేల 390 సిలిం డర్ లను పంపిణీ చేయడం జరిగిం దని, ఇందుకు 12 కోట్ల 41 లక్షల సబ్సిడీని ప్రభుత్వం ఇచ్చిందని చె ప్పారు.గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు వినియోగదా రులకు ఉచిత విద్యుత్తును ప్రభు త్వం అందిస్తు న్నదని, ఇందులో భాగంగా నల్గొండ జిల్లాలో రెండు లక్షల 13390 జీరో బిల్లులు జారీ చేయడం జరిగిందని, ఇందుకుగా ను ప్రభుత్వం 36 కోట్ల 15 లక్షల రూపాయల సబ్సిడీని ఇచ్చిందని తెలిపారు. రైతు రుణ మాఫీ పథ కంలో భాగంగా బ్యాంకుల ద్వా రా రెండు లక్షల రూపాయల వరకు రుణాలు పొందిన రైతుల రుణమా ఫీ ప్రకటించిందని, ఇందులో భాగం గా నల్గొండ జిల్లాలో లక్ష 71 788 మంది రైతులకు 14 21 కోట్ల 35 లక్షల రూపాయలు రుణమాఫీ అయిందని తెలిపారు.

ప్రజావాణి కార్యక్రమంలో (public radio program) భాగంగా రాష్ట్రస్థా యిలో 672 దరఖాస్తులకు గాను 595 పరిష్కారం అయ్యాయ ని, జిల్లాలో 7814 దరఖాస్తులకు గాను ,5785, మండలాలలో 6549 దర ఖాస్తులకు గాను, 5317 పరి ష్కారం అయ్యాయని తెలిపారు. సాగునీటి రంగంలో భాగంగా ఎస్ఎ ల్బీసీ ద్వారా 3 లక్ష ల ఎకరాలకు సాగు నీరు అందించనున్నామని, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 3 లక్షల 61,000 ఎకరాలకు నీటిని అంది స్తున్నామని, అలాగే బ్రాహ్మణ వెల్లే ములతో పాటు ఉదయ సము ద్రం, తడితర ప్రాజెక్టుల ద్వారా సైతం రైతులకు సాగునీటిని అందించ నున్నట్లు వెల్లడించారు. రైతు భరో సా పథకం కింద 15 వేల రూపాయ లు సబ్సిడీని అందించ నున్నామ ని,ఇందుకు ప్రణాళికలు సిద్ధం చేసి నట్లు మంత్రి (minsiter)వెల్లడించారు. నల్గొం డలో 5ఎకరాల విస్తీర్ణం లో 20 కోట్ల రూపాయలతో నర్సింగ్ కళా శాల నిర్మాణాన్ని చేపట్టామని, ఇది ప్రారంభానికి సిద్ధంగా ఉందని ఆయ న తెలిపారు. అలాగే 20 కోట్ల రూ పాయల వ్యయంతో యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిం చేందుకు నైపుణ్యాల అభివృద్ధి సంస్థ నిర్మా ణాన్ని చేపట్టామని, పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. రహదారుల అభివృద్ధి లో భాగంగా నల్గొండ జిల్లాలో 20 24- 25 సంవత్సరంలో 241.90 కిలో మీటర్ల రోడ్లు ,బ్రిడ్జిల మరమ్మ తులకు 512 కోట్ల 81 లక్షల రూపా యలను మంజూరు చేయడం జరి గిందని, ఇవే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమం కింద అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకా లను అమలు చేస్తున్నామని తెలి పారు.ఈ సందర్భంగా మంత్రి వివిధ పథకాల కింద లబ్ధిదారులకు చెక్కు లను పంపిణీ చేశారు.

డిఆర్డిఏ (DRDA)ద్వా రా బ్యాంకు లింకేజీ కింద 355 .34 కోట్ల రూపాయల చెక్కును, శ్రీనిధి పథకం కింద 25 కోట్ల 22 లక్షల రూపాయ ల చెక్కును అం దజేశా రు. పరిశ్రమల శాఖ ద్వారా వాణి జ్య వాహనాలకు 11 లక్షల రూపా యల చెక్కును, మెప్మా ద్వారా 768. 30 లక్షల రూపా యల చెక్కులను పంపిణీ చేశారు. ఉత్తమ సేవలం దించిన ప్రభుత్వ అధికారు లు, ఉద్యోగులకు మంత్రి ప్రశంస పత్రాలను అందజేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా ఏర్పాటుచే సిన విద్యార్థుల సాం స్కృతిక ప్రదర్శనలు ఆహుతు లను ఆకట్టుకున్నాయి. వివిధ శాఖల అభివృద్ధిని తెలిపే విధంగా ఆయా శాఖలు శకటాలను రూపొందిం చగా, మొదటి ఉత్తమ శకటంగా వ్యవ సాయ శాఖ, రెండవ ఉత్తమ శకటంగా డిఆర్డిఏ, మూడవ ఉత్త మ శకటంగా వైద్య ఆరోగ్య శాఖ(Medical Health Department), నాల్గవ ఉత్తమ శకటంగా అటవీ శాఖలు గెలుచుకున్నాయి. స్వతం త్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయా శాఖలు వారు చేపట్టిన అభి వృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై స్టా ల్స్ ను ఏర్పాటు చేయడం జరి గింది.ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టుతో పాటు, రైతు రుణమాఫీ చివరి విడత నిధుల విడుదల కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్య మంత్రి ఏ .రేవంత్ రెడ్డి హాజరవుతున్న కార్యక్రమానికి మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి హాజరయ్యె నిమిత్తం వెళ్ళగా ,అనంతరం జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి, తదితరులు ప్రభుత్వ స్టాల్స్ ను సందర్శించారు. అంతేకాక సాంస్కృతీక ప్రదర్శనలు ఇచ్చిన విద్యార్థులకు బహుమతుల ను అందజేశారు.ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఎమ్మెల్సీలు నర్సిరెడ్డి, కోటిరెడ్డి ,మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి, జిల్లా ఎస్ పి శరత్ చంద్ర పవార్,అదనపు కలెక్టర్లు టీ. పూర్ణచంద్ర ,జె. శ్రీనివాస్, అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ , ఆర్ డి ఓ రవి, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.