Komati Reddy Venkata Reddy: ప్రజా దీవెన, నల్లగొండ: ప్రఖ్యాత ఎన్జీవో ‘కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండే షన్’ (‘Komatireddy Pratik Foundation’)చైర్మన్ రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata Reddy) బుధవారం నల్గొండలోనితన క్యాంపు కార్యా లయంలో ప్రఖ్యాత సైంటిస్ట్ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు (Former President Abdul Kalam)నివాళు లర్పిం చారు. కార్యక్రమంలో ప్రతి ఫౌండే షన్ సీఈవో ఎం వి గోనారెడ్డి జెడ్పీ సీఈవో ప్రేమ్ కిరణ్ రెడ్డి, లైబ్రేరి యన్ నాగయ్య తది తరులు పాల్గొనగా అనంతరం పోటీ పరీక్ష లకు సిద్ధమవుతున్న నిరుద్యోగుల కు మద్దతుగా జెడ్పీ స్టడీ సర్కిల్, నల్గొండ పబ్లిక్ లైబ్రరీకి రూ.1,25,000 విలువైన జనరల్ నాలెడ్జ్ పుస్తకాలను మంత్రి లైబ్రేరియన్ కు జడ్పీ సీఈఓకు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఫౌండేషన్ (Foundation) అనుకూలమైన అధ్యయన వాతావరణాన్ని సృష్టించడం, వనరులకు ప్రాముఖ్యత అందించడం ప్రముఖ ప్రొఫెసర్లచే ప్రేరణాత్మక ఉపన్యాసాలు ఏర్పా టు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది అన్నారు. కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండే షన్ ద్వారా మంత్రి దాతృత్వంతో పాటు జిల్లాలోని నిరుపేదలను ఆదుకుం టున్నందుకు జెడ్పీ సీఈవో, నల్గొం డ పౌర గ్రంథాలయ అధికారులు సీఈఓ గోన రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. యువత యొక్క మండుతున్న మనస్సు భూమిపై, భూమి పైన మరియు భూమి క్రింద అత్యంత శక్తివంత మైన వనరు. అబ్దుల్ కలాం”కలాం సూక్తిని ఈ సంద ర్భంగా గుర్తు చేశారు.