–మంత్రి వెంకటరెడ్డి సొంత నిధుల తో డి-39, 40 కాలువల్లో పూడికతీ త పనులు
–డిసిసిబి డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి
Komati Reddy Venkata Reddy: ప్రజా దీవెన, నల్లగొండ: రైతుల సంక్షేమం (Welfare of farmers)కోసం నిరంతరం పాటుపడే వ్యక్తి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata Reddy)అని డిసిసిబి డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి అన్నారు. ఆదివారం పానగల్ ఉదయ సముద్రం నుంచి D-39, 40 కాలువలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సొంత నిధులతో చేపట్టిన పూడికతీత పనులను మాజీ జెడ్పిటిసి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వంగూరి లక్ష్మయ్య, నల్లగొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ తో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 15 ఎండ్ల క్రితం వైయస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy)హాయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata Reddy)డి-39, 40 కాలువలను ప్రారంభించాడని అన్నారు. ఆ తర్వాత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాలువలో పూడికతో చివరి రైతులకు నీరు అందక ఇబ్బందులకు గురయ్యారని పేర్కొన్నారు. రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతిక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా సొంత నిధులతో కాలువల పూడికతీత పనులను చేపట్టి రైతు బాంధవుడుగా నిల్చాడని కొనియాడారు. మాజీ జెడ్పిటిసి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వంగూరి లక్ష్మయ్య, నల్గొండ మార్కెట్ కమిటీ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ లు మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata Reddy)నల్గొండ నియోజకవర్గంలో రైతులకు సాగునీరు అందించేందుకు డిస్ట్రిబ్యూటరీ కాలువల నిర్మాణం చేపట్టాడని అన్నారు.
ఎన్నో ఏళ్లుగా కాలువలలో పూడిక, కంపచెట్టు (Pudika, kampachetu)పెరిగి చివరి భూముల (lans)రైతులకు సక్రమంగా నీరు అందేది కాదని అన్నారు. రైతులు పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన పట్టించుకోలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతఇటీవల రైతు పక్షపాతి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే స్పందించి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ (Pudika, kampachetu)ద్వారా సొంత నిధులతో జెసిబితో కాలువ పూడికతీత పనులను చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ కాలువలో పూడికతీత పనులు పూర్తయిన రెండు రోజులలోనే రైతులకు నీరందించడం జరుగుతుందని తెలిపారు. D39 , 40 కారులకు నీరు విడుదల చేయడం ద్వారా కాజీరామారం, తానేదార్పల్లి, కంకణాలపల్లి, జంగారెడ్డిగూడెం రామలింగాలగూడెం తదితర గ్రామాల రైతులకు తాగునీరు అందుతుందని తెలిపారు. రైతుల పక్షాన ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కృతజ్ఞ తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు , మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు ముత్తినేని శ్యాంసుందర్, దొంతినేని నాగేశ్వ రరావు, కోల్లు శ్రీనివాస్ రెడ్డి, కిన్నెర అంజి, పిఎసిఎస్ డైరెక్టర్ కృష్ణారెడ్డి, షబ్బీర్ బాబా, సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.