Komati Reddy Venkata Reddy: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: సమగ్ర శిక్షా కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని,మినిమం టైం స్కేల్ (Minimum time scale)అమలు చేయాలని సమగ్ర శిక్షా కాంట్రాక్టు ఎంప్లాయీస్ అసోసియేషన్ (Comprehensive Penalty Contractual Employees Association)ఆధ్వర్యంలో రోడ్లు,భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata Reddy) గారికి నల్గొండ లోని నివాసంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి ఉద్యోగులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి దృష్టికి లేఖ ద్వారా తీసుకువెళ్తానని అన్నారు.
గత సెప్టెంబర్ లో నల్గొండ కలెక్టరేట్ (Nalgonda Collectorate)సమగ్ర శిక్షా ఉద్యోగుల దీక్షకు మద్దత్తు తెలిపిన విషయం తనకి గుర్తుందని తప్పకుండా మినిమం టైం స్కేల్ ఇప్పించేలా కృషి చేస్తానని అన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే కాంట్రాక్టు ఉద్యోగులకు మేలు జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్షా కాంట్రాక్టు ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు తిరందాసు సంతోష్ కుమార్,మహిళా అధ్యక్షురాలు కేసాని లక్ష్మి, టిసిఅర్పిఎ జిల్లా ప్రధాన కార్యదర్శి పగిడిపాటి ప్రవీణ్ , మహిళా నాయకులు గుమ్ముల మంజుల, వసంత,స్వప్న, పుష్పాలత,రాజేశ్వరి,పద్మ , వడ్త్య రాధ,చౌడోజు శ్రీధర్,కవిత, మంజుల,మాధవి తదితరులు పాల్గొన్నారు.