Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Komati Reddy Venkata Reddy: నూటికి నూరుపాళ్ళు…రూ. 2 లక్ష ల రుణమాఫీ చేసి తీరుతాం

— కెసిఆర్ మొత్తానికి అసెంబ్లీకే ముఖం చాటేశాడు
–బీఆర్ఎస్ పాలనలో నిరుద్యో గు లకు ఉద్యోగాలు, పేదలకు ఇండ్లు లేవు
–అధికారంలోకి రాగానే 11 వేల మందికి డీఎస్సీ ద్వారా ఉద్యో గాలు కల్పించాం
–రెండు నెలల్లో SLBC సొరంగం పనులు ప్రారంభం
–రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమా టోగ్రఫీ శాఖామంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Komati Reddy Venkata Reddy: ప్రజా దీవెన, నల్లగొండ: కెసిఆర్ కు అసెంబ్లీకి వచ్చే మొఖం లేదని రాష్ట్ర రోడ్లు,భవనాలు, సినీమా టోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata Reddy) అన్నారు.మంగళవారం కనగల్ మండలం పగిడిమర్రి గ్రామంలో రూ.38 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన సోమన్నవాగు హైలెవల్ బ్రిడ్జ్ నిర్మాణానికి, కొత్తపల్లి – పగిడిమర్రి రోడ్ పగిడిమర్రి – మదనాపురం రోడ్, పగిడిమర్రి – కుదావన్ పూర్ రోడ్ (Pagidimarri – Kudavanpur Road). పనులకు పలువురు అధికారాలు, స్థానిక ప్రజా ప్రతినిధులు పార్టీ శ్రేణు లతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లా డుతూ కెసిఆర్ ,కేటీఆర్, హరీష్ రావులపై తీవ్రస్థాయిలో మండి పడ్డారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం 9 ఏండ్లలో చేసిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శించారు. నిరుద్యో గులకు ఉద్యోగాలు లేవని ఎక్కడ కూడా పేదలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చిన దాఖలాలు లేవని ద్వజమెత్తారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ముందుకు పోతుందని అన్నారు.

కెసిఆర్ కు అసెంబ్లీకి (Assembly to KCR) వచ్చే మొఖం లేదని ఎద్దేవా చేశారు. నిరుద్యో గులకు ఉద్యోగాలు లేవని, పేదల కు డబల్ బెడ్ రూములు ఇవ్వ కుండా మోసం చేశారని ఆరోపిం చారు. గత ప్రభుత్వ అవినీతి అక్ర మాలపై తాము నిలదీస్తామని భ యంతోనే కెసిఆర్ అసెంబ్లీకి రా కుండా భయపడుతున్నాడని అన్నారు. ఇప్పటికి మూడుసార్లు అసెంబ్లీ జరిగిన భయంతో కెసిఆర్ ఒక్కసారి కూడా అసెంబ్లీకి లేదని ఎద్దేవ చేశారు.కెసిఆర్ కు కొడుకు, బిడ్డ, అల్లుడు బాగోగులు తప్ప పేదల గురించి ఎన్నడూ పట్టిం చుకోలేదని విమర్శించారు.

అందుకే గత ఎన్నికల్లో నల్గొండ జిల్లా బిడ్డలంతా కేసీఆర్ ను బయటికి రాకుండా ఫామ్ హౌస్ కే పరిమితం చేశారని పేర్కొన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ (Congress party) ఎమ్మెల్యేలంతా 50 వేలకు పైగా మెజార్టీతో గెలుపొందారని అన్నారు.అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి చేయకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Govt) కాలయాపన చేసిందని విమర్శించారు. ఎస్ఎల్బీ సీ సొరంగ పనులను పట్టించుకోలే దని అన్నారు. సొరంగ పనులను పూర్తి చేసి ఉంటే జిల్లా రైతాంగానికి రెండు పంటలకు సాగునీరు అందేదని తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధిని విస్మరించిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారని విమర్శించారు.

కాంగ్రెస్ అధికారంలోకి (Congress in power) వచ్చిన తర్వాత తాము చేపడుతున్న అభివృద్ధి పనులను జీర్ణించుకోలేక అడ్డు తగులుతున్నారని ఆరోపించారు. కేటీఆర్ ,హరీష్ రావులు ప్రతిరోజు ప్రభుత్వాన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు.మూసితో నల్లగొండ జిల్లా ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తమ ప్రభుత్వం మూసి ప్రక్షాళనకు పూనుకోగా బీఆర్ఎస్ నేతలంతా అడ్డు తగలడం సిగ్గుచేటన్నారు.మూసి ప్రక్షాళనతో రంగారెడ్డి,నల్గొండ జిల్లాల్లు శశ్యామలం అవుతాయని స్పష్టం చేశారు. ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం ఆలస్యమైన రూ. 2 లక్షల రుణమాఫీ అమలు చేసి తీరుతామని వెల్లడించారు.

తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు రెచ్చగొట్టి వారి చావుకు కారణమైన విధంగా… ఇప్పుడు మూసి ప్రక్షాళన చేస్తుంటే అదేవిధంగా రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించిన మూసి ప్రక్షాళన చేస్తామని, బాధితులకు అండగా ఉంటామని మంత్రి స్పష్టం చేశారు.పేదలందరికీ కళ్ళలో ఆనందం చూడడమే తమ ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు.సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మంత్రులమంతా టీంగా రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నామని తెలిపారు. నల్గొండ జిల్లాలో ఒక్క ఆర్ అండ్ బి శాఖ ద్వారానే ఇప్పటికే రూ.600 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు.

కోట్లాది రూపాయలతో ఇంకా ఎన్నో అభివృద్ధి సంక్షేమ, పథకాలకు (development welfare and schemes)శంకుస్థాపనలు చేయడం జరిగిందని అన్నారు. రెండు నెలల్లో ఎస్ఎల్బీసీ సొరంగ పనులను ప్రారంభించి పూర్తి చేస్తామని మంత్రి పేర్కొన్నారు.రూ.4,600కోట్లతో అమెరికా నుంచి సముద్రమార్గం ద్వారా ఓడలో మిషన్ తెప్పిస్తున్నామని తెలిపారు.అభివృద్ధిలో నల్గొండ నియోజకవర్గాన్ని ఆదర్శంగా నిలుపుతానని స్పష్టం చేశారు. రోడ్లన్నింటినీ అభివృద్ధి చేసి గ్రామీణ ప్రాంతాల రోడ్ల రూపురేఖలు మారుస్తానని తెలిపారు.