–రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమా టోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
Komati Reddy Venkata Reddy: ప్రజా దీవెన, నల్లగొండ: తెలంగాణ ప్రజలు సుఖ సంతో షాలతో, పాడిపంటలతో విలసిల్లే విధంగా వినాయకుడు ఆశీస్సులు అందించాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata Reddy)అన్నారు. మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన నల్గొండ జిల్లాలో ఈ సంవత్సరం గతంలో కంటే గొప్పగా వినాయక ఉత్సవాలను నిర్వహించాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata Reddy) అన్నారు.ఆదివారం మంత్రి నల్గొం డ జిల్లా కేంద్రంలోని సావర్కర్ నగ ర్,హనుమాన్ నగర్, బోయవాడ, విద్యానగర్ కాలనీ,ఎన్జీ కాలేజ్ హౌ సింగ్ బోర్డ్,అల్కాపురి కాలనీ, ప ద్మావతి కాలనీ, పాతబస్తీ హను మాన్ నగర్ తదితర మండపాలను సందర్శించి వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తొమ్మిది రోజులపాటు నిర్వహించే వినాయక ఉత్సవాలను (Vinayaka festivals)శాంతియుతంగా జరుపుకోవాలని, జిల్లాలో ఎక్కడ ఎలాంటి చిన్న సంఘటనకు తావి వ్వకుండా అన్ని జాగ్రత్తలు తీసుకో వాలని, ప్రత్యేకించి యువత పూర్తి జాగ్రత్తగా ఉత్సవాలు జరుపుకోవా లని మంత్రి చెప్పారు. నిరుపేద లు ,నిరుద్యోగులు,రైతులు, (The poor, the unemployed, the farmers) అన్ని వర్గాల వారు ఇంకా ఉన్నత స్థానా లు పొందేలా వినాయకుడు ఆశీ ర్వదించాలని కోరారు. ఏడు సంవత్సరాల తర్వాత తిరిగి నల్గొండ జిల్లా కేంద్రంలో వివిధ వినాయక మండపంలో పూజ చేయడం తనకు సంతోషంగా ఉందని అన్నారు. వినాయక విగ్రహాలు నిమజ్జనం అయ్యేవరకు అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని, ఎక్కడ ఎలాంటి అవ్వంచనీయ సంఘటన జరగకుండా పోలీ సు,రెవెన్యూ, విద్యుత్,మున్సిపల్ తదితర శాఖల అధికారులు అను నిత్యం జాగ్రత్తగా ఉండాలని అన్నా రు. మండపాల (mandapa) వద్ద ఎప్ప టికప్పు డు పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టాలని మున్సిపల్ అధికారు లను ఆదేశించారు.
నల్గొండ జిల్లా లో ఇప్పటివరకు ఒక చిన్న సంఘ టన జరగలేదని, మతసామర స్యానికి ప్రత్యేకగా నల్గొండ నిలి చిందని, రాష్ట్రంలోనే నల్గొండకు మంచి పేరు ఉందని, గతంలో కంటే జాగ్రత్తగా, ఘనంగా ఈసారి వినా యక ఉత్సవాలు (Vinayaka festivals)నిర్వహించాలని ఆయన నిర్వాహకులకు సూచిం చారు.నల్గొండ పట్టణ అభివృద్ధిలో భాగంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తో పాటు, సిసి రోడ్లు, స్మశాన వాటిక (Sisi Roads, Graveyard)వంటివి వేయించనున్నట్లు తెలిపా రు .అంతేకాక విద్యా భివృ ద్ధిలో భాగంగా వైద్య కళా శాల, నర్సింగ్ కళాశాలను నిర్మి స్తున్నా మని, అలాగే యువత కు నైపుణ్యాల అభివృద్ధి కేంద్రాన్ని నిర్మి స్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్య క్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షు డు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ చైర్ పర్స న్ బొడ్డుపల్లి లక్ష్మీ శ్రీని వాస్, కౌన్సిలర్లు మారగోని నవీ న్ కుమార్ గౌడ్, వేణుగోపాల్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి వంగూరి లక్ష్మ య్య, అల్లి సుభాష్ యాదవ్, వం గాల అనిల్ రెడ్డి ఆర్డీవో రవి, తది తరులు ఉన్నారు.