–33/ 11 కేవీ సబ్ స్టేషన్ కు శంకు స్థాపన చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
Komati Reddy Venkata Reddy: ప్రజా దీవెన, నల్లగొండ: అభివృద్ధే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తున్నదని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి (Komati Reddy Venkata Reddy)అన్నారు.శుక్రవారం అయన నల్గొం డ జిల్లా, నల్గొండ మండలం, దొనక ల్ గ్రామంలో మూడు కోట్ల రూపా యల వ్యయంతో నిర్మించనున్న 33/ 11 కేవీ సబ్ స్టేషన్ కు శంకు స్థాపన చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ నల్ల గొండ చుట్టుపక్కల ప్రాంతం మొత్తం బోరు బావుల పై ఆధారపడిన ప్రాంతమని, బ్రాహ్మ ణ (bramhan) వెళ్లెముల ప్రాజెక్టు ద్వారా చెరు వులను నింపుకున్నట్లయితే ఈ కష్టాలు తీరుతాయని అన్నారు. విద్యుత్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఇటీవల జిల్లాలో ఏడు 33 / 11 కేవీ సబ్ స్టేషన్లను మంజూ రు చేయడం జరిగిందని, వారంలో రేగట్ట 3/11 కేవి సబ్ స్టేషన్ పనుల కు శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. బ్రాహ్మణ వెల్లేముల ప్రాజెక్టు పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, ఈ ప్రాజెక్టు ద్వారా దొనకల్ చెరువును సైతం నింపుతామని తెలిపారు. కాలువలను సంబంధించిన సర్వే చేయడం జరుగుతున్నదని, 25 కోట్ల రూపాయల నిధులు సైతం విడుదల చేసినట్లు ఆయన వెల్లడించారు .
ఎస్ఎల్ బిసీ సొరంగం పనుల (SL BC tunnel works) పూర్తికి 2200 కోట్లు కేటాయించడం జరిగిందని, తాను ఎల్లప్పుడూ రైతులు ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తామని, తెలంగాణ రాష్ట్రం కోసం ముందుగా రాజీనామా చేసింది తానేనని తెలిపారు. బడ్జెట్లో వ్యవసాయానికి 72,000 కోట్ల రూపాయలు కేటాయించామని, ప్రాజెక్టుల కోసం 22 వేల కోట్లు కేటాయించడం జరిగిందని తెలిపారు. రెండు మూడు సంవత్సరాలలో పెండింగ్లో ఉన్న అన్ని ప్రాజెక్టుల పనులను పూర్తిచేస్తామని ఆయన తెలిపారు. దొనకల్ లో లూజ్ వైర్ల సమస్యను పరిష్కరించాలని, అదేవిధంగా 5 ఎం వి ఏ పవర్ ట్రాన్స్ఫర్లు రెండు మంజూరు చేయాలని పక్కనే ఉన్న సీఎండీ బిక్షపతితో ఆయన కోరారు. రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని అన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని, క్యాబినెట్లో 100 కోట్ల రూపాయలు పెట్టడం జరిగిం దని, యువత వృధాగా ఉండకుం డా ఏదో ఒక పని నేర్చుకోవాలని కోరారు.
హైదరా బాద్- విజయ వాడ 6 లైన్ల రహదారి (Hydara Bad- Vijayawada 6 lane road p) పనులకు 2000 కోట్ల రూపాయలు కేటాయిం చడం జరిగిందని, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తో మాట్లాడి. ఆర్ ఆర్ ఆర్ ప్రాజెక్టుకు రూ. 15వేల కోట్లు కేటా యించామని చెప్పారు. జిల్లాలో రైతుల ధరణి (Dharani of farmers) సమస్యలను పదివేల దరఖాస్తులను జిల్లా కలెక్టర్ పరిష్కరించాలని తెలిపారు. జిల్లా లో అవసరమైన ప్రాంతాలలో రహదారులను అభివృద్ధి చేస్తున్నామని, ఆర్ అండ్ బి రోడ్లతో పాటు, పంచాయతీరాజ్ రోడ్లు, సిసి రోడ్లను చేపట్టడం జరి గిందని వెల్లడించారు. రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ సిజిఎం బిక్షపతి మాట్లాడుతూ దొనకల్ ప్రాంతానికి అడిగిన వెంటనే సబ్స్టేషన్ మంజూరు చేయడం జరిగిందని, అంతేకాక రాష్ట్ర రోడ్లు, భవనాలు శాఖ మంత్రి కోరిక మేరకు మరో ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేశామని, రెండు మూడు నెలల్లో దొనకల్ 33/11 కె వి సబ్ స్టేషన్ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి మాట్లా డుతూ రైతులు బాగుంటేనే అందరూ బాగుపడ తారని, దీంతో పాటు, విద్య, వైద్య సేవలు పేద ప్రజలకు అందించాల ని, అలాగే నాణ్యమైన విద్యుత్తును అందించేం దుకు దొనకల్లు సబ్ స్టేషన్ ద్వారా వీలవుతుందని, రెండు, మూడు నెలల్లో ఈ సబ్ స్టేషన్ పనులను పూర్తి చేస్తామని విద్యుత్ అధికారు లు తెలపడం సంతో షకరమైన అన్నారు.ఈ కార్యక్ర మంలో ట్రాన్స్కో ఎస్ ఈ చంద్ర మోహన్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి,ఎలక్ట్రిసిటీ డి ఈ , మాజీ జడ్పిటిసి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.