–కాలుష్యాన్ని అరికట్టడంతో పాటు, వర్షాలు అధికంగా కురిసేందుకు మొక్కలు దోహదం
–ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, అధి కారులు, ప్రజా ప్రతినిధులు అంద రూ మొక్కలు నాటాలి
–వనమహోత్సవంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమా టోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
Komati Reddy Venkata Reddy:ప్రజా దీవెన, నల్లగొండ బ్యూరో: మొక్కలు నాటడాన్ని (Planting) ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాల ని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమా టోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata Reddy) అన్నారు. వనమహోత్స వం కార్యక్రమం లో భాగంగా గురు వారం అయన నల్గొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో మొక్కలు నాటారు. అనంతరం మంత్రి మీడి యా ప్రతినిధులతో మాట్లాడుతూ కాలుష్యాన్ని అరికట్టడంతో పాటు, వర్షాలు అధికంగా కురిసేందుకు మొక్కలు (plants) దోహదం చేస్తాయని, అడవులు ఎక్కువగా ఉన్నచోటనే వర్షాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని అన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరు మొక్కలు నాటడం సామాజిక బాధ్యతగా తీసుకోవాలని కోరారు. కాలుష్యం వల్ల కలిగే పరిణామాలు, ఇటీవల కరోనా ఉదంతం ప్రతి ఒక్క రు గుర్తుంచు కోవాలని అన్నారు. మొక్కలు నాటే బాధ్యత ఒక్క ప్రభుత్వానిది మాత్రమే కాదని, ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు, ప్రజా ప్రతినిధులు అందరూ మొక్కలు నాటాల నికోరారు. ప్రత్యేకించి రాజకీయ నాయకులు పార్టీలకతీతంగా మొక్కలు నాటాల్సిన (planting)అవసరం ఉందని చెప్పారు. వన మహోత్స వం కార్య క్రమంలో భాగంగా నల్గొండ జిల్లాలో ఈ సంవత్సరం 66 లక్షల మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవడం జరిగింద ని ,మొక్కలు నాటడంతో పాటు నాటిన ప్రతి మొక్క సంరక్షించేలా చర్యలు తీసుకుంటున్నామని, మొక్కలు నాటే కార్యక్ర మం మన భవిష్యత్తు కు సంబంధిం చిందని, ఎక్కడ ఖాళీ స్థలం ఉన్న, ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురికాకుండా అన్ని స్థలాలలో అలాగే రహదారులకు ఇరువైపులా అన్నిచోట్ల మొక్కలు నాటాలని కోరారు.
అంతకుముందు మంత్రి విద్యార్థులు, ఉపాధ్యాయు (Students and teacher) లతో ముఖాముఖి మాట్లాడారు. పదవ తరగతిలో గత సంవత్సరం ఎంతమంది పాస్ అయ్యారని ? అడిగి తెలుసుకున్నారు. 16 మందికి 14 మంది ఉత్తీర్ణుల య్యారని పాఠశాల ప్రధానోపా ధ్యాయులు, ఉపాధ్యాయులు తెలపగా పదవ తరగతిలో ఏ ఒక్కరు ఫెయిల్ కాకూడదని, తప్పనిసరిగా 9.5 పైనే గ్రేడ్ రావాలని, ఇందుకు గాను ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎక్స్ట్రా క్లాసులు తీసుకో వాలని చెప్పారు.పదో తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో ఏం కావాలనుకుంటున్నారని అడి గారు. తనతో పాటు, జిల్లా కలెక్టర్ ప్రభుత్వ పాఠశాలలోనే (Collector Government School) చదివి జిల్లా కలెక్టర్ గా, మంత్రిగా అయ్యామని విద్యార్థులు చదువు పైన దృష్టి సారించాలని, ఇప్పటినుండే జీవితంలో ఒక లక్ష్యాన్ని నిర్దేశించు కుని ఆ లక్ష్యసాధనకు కృషి చేయాలని తెలిపారు. పాఠశా లకు అవసరమైన డ్యూ యల్ డెస్క్లను మూడు నాలుగు రోజుల్లో పంపించడం జరుగుతుందని, అదేవిధంగా పాఠశాలకు తాగునీటి కోసం వాటర్ ట్యాంకు కోరగా తక్షణమే మంజూ రు చేశారు. నాలుగు టాయిలెట్ల ను,ముగ్గురు స్కావెంజర్లను తక్షణమే ఏర్పాటు చేస్తానని, మంత్రిహామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి డిజిటల్ బోర్డుపై తరగతులను పరిశీలిం చారు.
జిల్లావ్యాప్తంగా ఆయా పాఠశాలల్లో అవసరమైన మౌలిక వసతులు, ఇతర వివరాలను తక్షణమే సమర్పిం చాలని డీఈఓ ను ఆదేశించా రు.జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి (narayana reddy) వనమహోత్స వం జిల్లా లక్ష్యాలను మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టీ. పూర్ణచం ద్ర ,జిల్లా అటవీ శాఖ అధికారి రాజశేఖర్ ,డి ఆర్ డి ఓ నాగిరెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి, మిషన్ భగీరథ ఎస్ ఈ వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్ ఈ ఈ భూమయ్య, ఆర్డీవో రవి, డిఎస్పి శివరామిరెడ్డి, పాఠశాల ప్రధానోపా ధ్యాయులు, ఉపాధ్యా యులు, మాజీ జెడ్పిటిసి పాశం రామ్ రెడ్డి, మాజీ సర్పంచ్ రమేష్, మాజీ ఎంపీటీసీ పల్లి ఎల్లయ్య, విజయలక్ష్మి తదితరులు ఉన్నారు.