–క్రీడలకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నాం
–దేశంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు ప్రభుత్వం కృషి
–ఖో ఖో ట్రయల్స్ లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
Komati Reddy Venkata Reddy: ప్రజా దీవెన, నల్లగొండ: క్రీడా రంగంలో తెలంగాణను దేశంలోనే ముందుంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి (Komati Reddy Venkata Reddy)తెలిపారు. ఇందులో భాగంగా క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని చెప్పారు.బుధవారం అయన నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంలో (NG College Grounds)నిర్వ హించిన ఖేలో ఇండియా వుమెన్ ఖో ఖో తెలంగాణ రాష్ట్ర సెలక్షన్ ట్రయల్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జాతీయ స్థాయి సెలక్షన్స్ కు నిర్వ హిస్తున్న ట్రయల్స్ లో క్రీడాకారు లందరూ రాణించా లని కోరారు.
గతంలో తెలంగాణకు ఈ క్రీడలలో సిల్వర్ మెడల్ వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే క్రీడా రంగంలో ముందుం చేలా ప్రభుత్వం కృషి చేస్తున్నదని, ఇందులో భాగంగా గచ్చిబౌలిలో స్పోర్ట్ యూనివర్సిటీ (Sport University in Gachibowli )ఏర్పాటు చేసి భవిష్యత్ ఒలంపిక్స్ లో రాష్ట్రం ముందుండే విధంగా చూస్తున్నదని చెప్పారు.ఆటో డ్రైవర్ కుమారుడైన టాప్ బౌలర్ సిరాజ్ కు ప్రభుత్వం తరఫున గ్రూప్ వన్ ఉద్యోగంతో పాటు, 500 గజాల స్థలాన్ని, అన్ని రకాల సౌకర్యాలు కల్పించిందని చె ప్పారు. విద్యార్థులు చదువు తోపాటు, క్రీడల్లో పాల్గొనాలని మంత్రి కోరారు. జనాభాలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న భారత్ ఒలంపిక్స్ పథకాల్లో చివరి నుండి రెండో స్థానంలో ఉందని,సౌత్ కొరియా లాంటి చిన్న దేశం రెండు వందల మెడల్స్ సాధిస్తే మన దేశం రెండు మెడల్స్ సాధించడం బాధాకరమైన విషయం అని అన్నారు .ప్రతి ఒక్కరికి చదువు ఎంత ముఖ్యమో, ఆటలు కూడా అంతే ముఖ్యమని, చదువుతో పాటు ఆటలపై శ్రద్ధ చూపిస్తే శారీరకంగా ,మానసికంగా సామర్ధ్యాలను కలిగి ఉంటారని అన్నారు. ఉమెన్ ఖో ఖో క్రీడాకారులకు ప్రతీక్ ఫౌండేషన్ తరఫున ట్రాక్ సూట్ కొనుగోలుకై రెండు లక్షల రూపాయల ఇస్తున్న ట్లు ప్రకటించారు. రాష్ట్రస్థాయిలో ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఒక టోర్న మెంట్ నిర్వహిం చేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి ప్రకటించా రు. మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివా సరెడ్డి (Burri Sriniva Sareddy), ఖేలో ఇండియా ఉమెన్ ఖో ఖో జిల్లా కార్యదర్శి కృష్ణమూర్తి మాట్లాడారు. ఇన్చార్జ్ ఆర్డిఓ శ్రీదేవి, డిఎస్పి శివరామిరెడ్డి, మాజీ జెడ్పిటిసి లక్ష్మయ్య తదితరులు హాజరయ్యారు.