Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Komati Reddy Venkata Reddy: జిల్లాను అన్ని రంగాల్లో అగ్రస్థా నంలో నిలపాలి

— రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Komati Reddy Venkata Reddy: ప్రజా దీవెన, నల్లగొండ: నల్గొండ జిల్లాను అన్ని రంగాలలో మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata Reddy) నూతన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో (Tripathi) కోరారు. నల్గొండ జిల్లా నూతన కలెక్టర్ గా సోమవారం బాధ్యతలు తీసుకున్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం ఉదయం నల్గొండ జిల్లా కేంద్రంలోని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి క్యాంప్ కార్యాలయానికి వెళ్లి మర్యాదపూర్వకంగా మంత్రిని కలిశారు.జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ (SP Sarath Chandra Pawar) సైతం మంత్రిని క్యాంపు కార్యాలయంలో కలిశారు.

ఈ సందర్భంగా మంత్రి జిల్లా కలెక్టర్ ,ఎస్పీలతో (District Collector, SP) వివిధ అంశాలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, వాటి ప్రాధాన్యతలు, తన శాఖ రోడ్లు భవనాల తోపాటు, ప్రస్తుతం ప్రాధాన్య కార్యక్రమాలైన ధాన్యం సేకరణ, తదితర అంశాలపై మాట్లాడారు.ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాలను పకడ్బందీగా అమలు చేయడమే కాకుండా, అన్ని అంశాలలో జిల్లాను మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా మంత్రి జిల్లా కలెక్టర్ ఎస్పీలకు చెప్పారు.