–పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవoలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
Komati Reddy Venkata Reddy:ప్రజా దీవెన, నల్లగొండ: సమాజాన్ని శాంతియుతంగా ఉంచడంలో పోలీ సుల పాత్ర మరువలేనిదని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి(Komati Reddy Venkata Reddy) అన్నారు. ఏ స్వార్థం లేకుండా సమాజం కోసం ప్రాణాలర్పించడా నికైనా వెనకాడని సేవకుడు పోలీ సు అని ఆయన కొనియాడారు.
సోమవారం నల్గొండ జిల్లా పోలీస్ పరీడ్ మైదానంలో(Police Parade Ground) నిర్వహించిన పోలీసు అమర వీరుల సంస్మరణ (పోలీస్ ఫ్లాగ్ డే) దినోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు.అనంతరం మంత్రి మాట్లాడుతూ దేశ రక్షణ కోసం, సమాజ సేవ కోసం అమరులైన ప్రతి పోలీసు కుటుంబానికి తన సానుభూతిని తెలియజేశారు. పోలీసులు వారి జీవితాలను పణంగా పెట్టి ప్రజలకు రక్షణ కల్పి స్తారని, పోలీస్ స్టేషన్ అంటే భయ పెట్టే కేంద్రం కాదని, బాధలను తీర్చే కేంద్రమని మంత్రి అన్నారు.
సమా జ శ్రేయస్సు కోసం ఎందరో పోలీసులు (police)వారి ప్రాణాలను సైతం ఫణంగా పెట్టారని ,నల్గొండ జిల్లాలో సుమా రు 15 మంది పోలీసులు అమరు లైనారని వారి కుటుంబాలకు తాను అండగా ఉంటానని, అమరలైన పోలీసు కుటుంబాలకు సహాయం చేయడం విషయమై రాష్ట్ర ముఖ్య మంత్రితో చర్చించి తగువిధంగా ఆదుకుంటామన్నారు. అంతేకాక కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వా రా అమరుల పోలీస్ కుటుంబా లకు ఒక్కొక్కరికి 25 వేల రూపా యల ఆర్థిక సహాయాన్ని మంత్రి ప్రకటించారు. అంతేకాక వారి పిల్ల ల ఉన్నత చదువులకు, ఖర్చులకు సైతం అండగా ఉంటానని తెలిపారు .అమరులైన పోలీసుల ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని ప్రార్థించారు .సమాజంలో ప్రతి ఒక్కరు పోలీసులను (police) గౌరవించాలని ఆయన పిలుపునిచ్చారు.
జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి (Narayana Reddy) మాట్లాడుతూ దేశ సేవలో ప్రజల రక్షణకై శాంతిబద్రతలు కాపాడడంలో ప్రాణాలర్పించిన పోలీసులను స్మరిస్తూ వారికి నివాళులర్పించి వారి కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు. శాంతి,భద్రతలను కాపాడటంలో అతి ముఖ్య పాత్ర పోషించేది పోలీస్ శాఖ అని, పరిపాలనలో పోలీసు వ్యవస్థ వెన్నెముక లాంటిదని అన్నారు. అభివృద్ధి పరిగెత్తాలంటే శాంతిభద్రతలు సవ్యంగా ఉండాలని చెప్పారు .
మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రజలకు రక్షణ కల్పిస్తూ ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటు ప్రాణాలు కోల్పోతున్న పోలీసులు గొప్పవారని అన్నారు .పోలీస్ వీధి నిర్వహణ కత్తి మీద సాములాంటిదని సమాజం అమరులైన పోలీసుల రుణం ఎప్పటికీ తీర్చుకోలేదని, వారి సేవలకు అందరూ రుణపడి ఉండాలని అన్నారు. నల్గొండ జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు పోలీస్ శాఖ చేస్తున్న కృషికి తనవంతు సహకారం అందిస్తానన్నారు .
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ (SP Sarath Chandra Pawar) మాట్లాడుతూ విధి నిర్వహణలో దేశవ్యాప్తంగా 214 మంది పోలీస్ లు చనిపోతే, తెలంగాణలో ఒకరు చనిపోయారని తెలిపారు. నల్గొండ జిల్లాలో 1991 నుండి 2024 వరకు 15 మంది పోలీసులు అమరులయ్యారని, ప్రాణాలు తెగించి పోరాడి ప్రాణాలు కాపాడే పోలీసులకు ఈ సందర్బంగా ఆయన వందనం సమర్పించి పోలీస్ అమరవీరులకు నివాళులర్పించారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసు కుటుంబాలకు అండగా ఉంటా మని తెలిపారు.
స్థానిక సంస్థల (Local organizations)అదనపు కలెక్టర్ టి. పూర్ణచంద్ర, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, అదనపు ఎస్పీ రాములు నాయక్, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మాజీ జెడ్పిటిసి లక్ష్మయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, డీఎస్పీలు ,పోలీసు అధికారులు, పోలీసు అధికారుల సంఘం నాయకులు ,ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు ,పోలీసు అమరవీరుల కుటుంబాల సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విధి నిర్వహణలో అమరులైన 15 మంది పోలీసు కుటుంబ సభ్యు లకు ఈ సందర్బంగా మంత్రి ఒక్కొక్కరికి పదివేల రూపాయల చొప్పున చెక్కులను అందజేశారు