–మంత్రి కోమటిరెడ్డికి వినతిపత్రం అందజేస్తున్న వీఆర్వో జేఏసీ
Komati Reddy Venkata Reddy: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: గ్రామ రెవెన్యూ వ్యవస్థను మళ్లీ ప్రవేశపెట్టి ఇతర శాఖలలో సర్దుబాటు చేసిన వీఆర్వోలను తిరిగి రెవిన్యూ శాఖ లో సర్దుబాటు చేయాలని తెలంగాణ రెవెన్యూ ఆఫీసర్ జాయింట్ (Telangana Revenue Officer Joint)యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సోమ వారం నల్లగొండ లోని క్యాంపు కార్యా లయంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు సినిమాటో గ్రఫీ శాఖ మంత్రి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని (Komati Reddy Venkata Reddy) కలిసి వినతిపత్రం అందజేశారు.గత ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను రద్దు చేసిందని ఆరోపించారు.
వీఆర్వోల ను రద్దు చేయడంతో గ్రామాలలో విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయని, గ్రామాలలో ఖరీదైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతా నికి గురవుతు న్నాయని, సంక్షేమ పథకాల (Welfare schemes) అమలు అనేక అవకతవక లు చోటు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు.గత ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 121 రద్దుచేసి ఇతర శాఖలలోకి బదిలీ అయిన వీఆర్వోలు అందరినీ రెవెన్యూ శాఖలోకి తీసుకోవాలని మంత్రిని కోరారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata Reddy) మాట్లాడుతూ ఈ సమస్యను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని మాట ఇచ్చారు. వినతి పత్రం అందజేసిన వారిలో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డికి వినతిపత్రం అందజేస్తున్న వీఆర్ వో జేఏసీ నాయకులు (JAC leaders) వీఆర్వో జేఏసీ జిల్లా అధ్యక్షుడు పగిళ్ల వెంకటయ్య, అసోసియేట్ అధ్యక్షుడు జిల్లా వెంకటేశం, పగిడిపాటి ప్రసాద్, బుడిగపాక యాదయ్య, ఏర్కచర్ల వెంకన్న, కోశా ధికారి ఎండి ముబిన్ అహ్మద్, ఎస్ కే జాన్, పల్లె శ్రీనివాస్, ఎం యాదయ్య, పి. గోపి, రామస్వామి, నజీర్, తదితరులు ఉన్నారు.