–నల్లగొండ జిల్లాలో ఆర్అండ్ బి రహదారులకు రూ. 600 కోట్లు మంజూరు
–రోడ్డు, భవనాలు, సినిమా టోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
Komati Reddy Venkata Reddy: ప్రజా దీవెన, నల్లగొండ: తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ మట్టిరోడ్డు అన్న దేలేకుండా ఆర్ అండ్ బి, పంచా యతీరాజ్ రహదారులు నిర్మిస్తామ ని రాష్ట్ర రోడ్డు, భవనాలు, సినిమా టోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata Reddy) తెలిపారు. మంగళవా రం ఆయన నల్గొండ జిల్లా కనగల్ మండలం పగిడిమర్రి గ్రామం సమీ పంలోని సోమన్న వాగు వద్ద రూ. 38 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మూడు డబుల్ రోడ్లు, హై లెవెల్ బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చే శా రు.ఈ సందర్భంగా మంత్రి మాట్లా డుతూ రాష్ట్రంలో రహదారుల అభివృద్ధిలో భాగంగా, 30 వేల కోట్ల రూపాయల వ్యయంతో రీజి నల్ రింగ్ రోడ్డును నిర్మిస్తున్నామని తెలిపారు.
ప్రత్యేకించి నల్గొండ జిల్లాలో ఆర్ అండ్ బి రహదారులకు (R&B Highways) రూ. 600 కోట్లు మంజూరు చేయడం జరిగిందని ,శ్రీశైలం- దేవ రకొండ రహదారి అటవీ ప్రాంతంలో ఉన్నప్పటికీ అభివృద్ధి చేస్తున్నా మని ,కనగల్ జంక్షన్ ను 8 కోట్ల రూపాయలతో వెడల్పు చేయడం జరుగుతున్నదని, అంతేకాక అక్క డ అంబేద్కర్ విగ్రహాన్ని (Ambedkar statue) ఏర్పాటు చేస్తున్నామని, ధర్వేశిపురం రోడ్డు వెడల్పు చేసి నాలుగు నెలల్లో పనులు పూర్తి చేయనున్నామని, అలాగే తిప్పర్తి జంక్షన్ ను 9 కోట్ల రూపాయలతో వెడల్పు చేసే పను లు ప్రారంభించడం జరిగిందని, ఇటీవలే మిర్యాలగూడలో 147 కోట్ల రూపాయలతో ఆర్ అండ్ బి రహదారి పనులు ప్రారంభించడం జరిగిందని మంత్రి వెల్లడించారు. 38 కోట్ల రూపాయలతో చేపట్టిన కొత్తపల్లి- పగిడిమర్రి, పగిడిమర్రి- మదనపురం ,పగిడిమర్రి- కుదవన్ పూర్ రోడ్లతోపాటు, పగిడిమర్రి అంతారం డబుల్ రోడ్డు పనులు బుధవారం నుండి ప్రారంభం చేసి పది నెలల్లో బ్రిడ్జితో సహా పూర్తి చేస్తామని చెప్పారు.పగిడిమర్రి రోడ్డుతో పాటు, చెక్ డ్యామ్ సైతం నిర్మిస్తున్నామని, దీనివల్ల భూగర్భ జలాలు పెరిగి రైతులకు మేలు కలుగుతుందన్నారు.
రాష్ట్రంలో ఎక్కడ మట్టి రోడ్డు (dirt road) లేకుండా గ్రామాల నుండి మండల కేంద్రానికి,మండల కేంద్రం నుండి జిల్లా కేంద్రానికి సుమారు 12 వేల కిలోమీటర్ల మేర ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ రోడ్ల నిర్మాణానికి (For construction of roads)రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లు మంత్రి తెలిపారు. రోడ్లు, లిఫ్ట్ ఇరిగేషన్లు ,కాలువలు (Roads, lift irrigations, canals) పూర్తి చేస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని మంత్రి చెప్పారు. ప్రభుత్వం ద్వారా 100 కోట్ల రూపాయలు చేయించి వారం రోజుల నుండి బ్రాహ్మణవెల్లెముల లిఫ్ట్ పనులు నడుస్తున్నాయని, మూడు మాసాలలో లక్ష ఎకరాల కు సాగు నీరు ఇవ్వనున్నామని ఆయన చెప్పారు. అదేవిధంగా ఎస్ఎల్బీసీ సొరంగం బడ్జెట్ ను 4600 కోట్లకు పెంచి అమెరికా నుండి ఇంజన్ బేరింగ్ ని తెప్పించి రెండు నెలల్లో పనులు ప్రారంభిం చనున్నామని, రెండేళ్లలో ఎస్ఎల్ బిసీ పనులు పూర్తి చేసి రెండు పంటలకు నీళ్లు ఇస్తే రైతుల కళ్ళ ల్లో సంతోషం కనబ డుతుంద న్నారు.
దీపావళి తర్వాత ఇల్లు లేని నిరుపేదలకు అసెంబ్లీ నియో జకవర్గానికి (Assembly Constituency) 3500 చొప్పున ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టనున్నామని, రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగిందని, ప్రతి ఎకరాకు సాగునీ రు ఇవ్వడంతో పాటు, మిగిలిపో యిన లిఫ్ట్ ఇరిగేషన్లను పూర్తి చేయడమే తమ లక్ష్యమని తెలిపారు.నవంబర్ నెలలో నల్గొం డ ప్రభుత్వ వైద్య కళాశాల తో పాటు, బ్రాహ్మణ వెళ్లెములను రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారా ప్రారంభించే ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎవరు ఎన్ని మాట్లాడినా మూసీ నది శుద్దీకరణ చేస్తామని అన్నారు.
అనంతరం మంత్రి నల్గొండ- ముషంపల్లి ఆర్ అండ్ బి రహదారి (R&B road) నుండి ఐత వారి గూడెం వరకు 95 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. మిర్యాల గూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ,ఆర్ అండ్ బి ఎస్ ఈ సత్యనారాయణ రెడ్డి, డి ఈ గణేష్,ఇతర అధికారులు, స్థాని క ప్రజాప్రతినిధులు, తదిత రులు ఉన్నారు.