— ప్రభుత్వ పాఠశాలల పట్ల చిన్న చూపు తగ్గించాలి
–ప్రభుత్వ పాఠశాలల్లో చదివి అ త్యున్నత స్థానాల్లో ఉన్నారు
— రాష్ట్ర రోడ్లు, భవనాలు సినిమా టోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
Komati Reddy Venkata Reddy: ప్రజా దీవెన నల్లగొండ: సమాజంలో ప్రభుత్వ పాఠశాలల పట్ల చిన్న చూ పుపోవాలని రాష్ట్ర రోడ్లు, భవనా లు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata Reddy) అన్నారు. గురువారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని బొట్టుగూడ లో మూ డు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ప్రభుత్వ పాఠశాల నూతన భవనానికి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లా డుతూ బొట్టుగూడ పాఠశాలకు ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నాయని, 1952లో ప్రారంభమైన ఈ పాఠశాల లో అనేకమంది మేధావులు, ఇంజ నీర్లు, అధికారులు, డాక్టర్లు చదువు కున్నారని, అలాంటి పాఠశా ల అద్దె భవనంలో, ఇరుకు గదుల్లో నిర్వ హించడం తనను కలిచివేసిందని,, దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతీక్ ఫౌండేషన్ (Prateek Foundation)ద్వారా మూడు కోట్ల రూపాయలతో బొట్టుగూడ ప్రభు త్వ పాఠశాలను నిర్మిం చేందుకు నిర్ణయించినట్లు తెలిపారు.
రాబో యే ఆరు సంవత్సరాల కాలంలో తెలంగాణలోనే బొట్టు గుడ ఉన్నత పాఠశాలను (high school) చూసేందుకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే విధంగా పాఠశాల నిర్మాణాన్ని చేపడుతామ ని తెలిపారు. గతంలో కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి జూనియర్ కళాశాలకు సైతం నూతన భవనం నిర్మించిన తర్వాత కళాశాల విద్యార్థుల సంఖ్య 3000 కు పెరిగిందని, పాఠశాలలు, కళాశాలల్లో (Schools, colleges) అన్ని వసతులు కల్పిస్తే సహజంగానే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని అన్నారు. సమాజంలో ప్రభుత్వ పాఠశాలల పట్ల చిన్నచూపు ఉందని, ఇది రూపుమాపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ప్రస్తుతం సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్న ఎంతోమంది ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారే ఎక్కువగా ఉన్నారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు డీఎస్సీ ద్వారా ఎంపిక అవుతారని, అన్ని విద్యార్హతలు ఉంటాయని, ఈ విషయాన్ని మర్చిపోవద్దుని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో (Schools, colleges) బట్టి విధానం అమలు చేస్తారని చెప్పారు .
జిల్లాలో 250 ఎకరాల్లో మహాత్మ గాంధీ యూనివర్సిటీని చేపట్టడం జరిగిందన్నారు. సెప్టెంబర్ 12న నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలను రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని లక్ష్యసాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. చదువుకున్న విద్యార్థుల నైపుణ్యాల అభివృద్ధికి గాను రాష్ట్రంలో 350 కోట్ల రూపాయలతో స్కిల్ యూనివర్సిటీని నిర్మించనున్నామని, దానికి ఇటీవలే శంకుస్థాపన (foundation stone)చేయడం జరిగిందని, నల్గొండ జిల్లా కేంద్రంలో సైతం 20 కోట్ల రూపాయలతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను నిర్మిస్తున్నామన్నారు. బొట్టు గుడ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రాబోయే పదవ తరగతి పరీక్షల్లో పదికి పది జిపిఎ సాధించాలని, 10:10 జిపిఏ సాధించిన వారికి తన సొంత ఖర్చులతో 50 వేల రూపాయలు బహుమతిగా ఇస్తానని, పదికి 9.7 జిపిఎ సాధించిన వారికి 30 వేల రూపాయలు ,9.5 జిపిఎ సాధించిన వారికి 20 వేల రూపాయల నగదును మంత్రి ప్రకటించారు. ఫిబ్రవరి లోపు పాఠశాల నిర్మాణాన్ని పూర్తిచేయాలని, రెండు రోజుల్లో పాఠశాల విద్యార్థులకు తన సొంత నిధుల ద్వారా బూట్లు అందజేయ నున్నట్లు మంత్రి తెలిపారు. పాఠశా లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు విద్యార్థులను దత్తత తీసుకొని పది కి పది జిపిఎ సాధించే విధంగా చూ డాలని మంత్రి కోరారు. అదనపు కలెక్టర్ జే. శ్రీని వాస్, డీఈఓ బిక్షప తి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివా సరెడ్డి, పాఠశాల హెడ్ మాస్టర్ శంకరయ్య తదితరులు పాల్గొ న్నారు.