–రాష్ర్ట రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
Komati Reddy Venkata Reddy:ప్రజా దీవెన, నల్లగొండ: తెలంగాణ లో రెండు లక్షల రూపాయల లోపు రుణమాఫీ పథకం (Loan waiver scheme) దేశంలోనే ఎక్క డ కనివిని ఎరగని రీతిలో పండుగ వాతావరణం లో నిర్వహించడం జరిగిందని రాష్ర్ట రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata Reddy) పేర్కొన్నారు. ఒకేసారి సుమారు రూ. 32,000 కోట్ల రూపాయల రూ. 2 లక్షల లోపు రుణాలను మాఫీ చేసి మా ప్రభు త్వం చరిత్ర సృష్టించిందని స్పష్టం చేశారు. రైతులు అప్పులపాలు కావద్దన్నదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశ మని, పేదవాడికి, ఆపదలో ఉన్న వాడికి, ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రుణమాఫీ లో భాగంగా నల్గొండ జిల్లాకు గురువారo రూ. 481 కోట్ల రూపాయలు రాష్ట్రంలోనే అత్యధికంగా వచ్చాయని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం (State Govt)రెండు లక్షల రూపాయల లోపు రుణా లున్న రైతుల రుణమాఫీ కార్యక్ర మం కింద మొదటి విడతన లక్ష రూపాయల లోపు రుణాల మాఫీకై గురువారం నిధులు విడుదల కార్యక్రమం ఏర్పాటు సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎంఎన్ ఆర్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు, భవనా లు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata Reddy)మాట్లా డారు. రాబోయే కాలంలో మరిన్ని ఎక్కువ నిధులు తీసుకువచ్చి జిల్లా ప్రజలకు అండగా ఉంటామని అన్నారు. రుణమాఫీ పొందిన రైతుల ఖాతాలలో డబ్బులు పడకు న్నా, పాత బాకీ కి ఎవరైనా జమ చేసుకున్న నేరుగా నాకు గాని, జిల్లా కలెక్టర్ గాని ఫోన్ చేయండని సూచించారు.వారం రోజుల్లో లక్ష న్నరలోపు రుణాలున్న రైతుల రుణాలు మాఫీ అవుతాయని, ఆ తర్వాత వారంలో రూ. 2 లక్షల వరకు ఉన్న రుణాలు రుణమాఫీ అవుతాయని వెల్లడించారు. ఆగస్టు చివరినాటికి 2 లక్షల లోపు రుణా లున్న రైతులందరి రుణాలు మాఫీ చేయబడతాయని చెప్పారు. నల్గొం డ జిల్లాలో 60 కోట్ల రూపాయలతో పాఠశాలల్లో గదుల నిర్మాణం, మౌలి క వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ పాఠ శాలల్లో డిజిటల్ ( Digital in government schools)తరగతులు ఏర్పా టు చేసి పిల్లలకు విద్య అందించే ఆలోచనలో ఉన్నామని, జిల్లాలో చేపట్టిన ఎస్ఎల్ బి సి సొరంగం, బ్రాహ్మణ వెల్లేముల ప్రాజెక్టుల పూర్తికి గ్రీన్ ఛానల్ లో నిధులను పెట్టించి 26 నెలల్లో పనులు పూర్తి అయ్యేలా రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.
రుణమాఫీ (Loan waiver scheme) చేసిన ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు నల్గొండ జిల్లాలో (nalgonda) పండగ వాతావరణం నెలకొందని వెంకటరెడ్డి అన్నారు. రైతులంతా చాలా సంతోషంగా ఉన్నారని, నేను స్వయంగా 5 కిలోమీటర్లు ట్రాక్టర్ నడుపుతూ వేదిక వద్దకు వస్తుంటే వేలాది మం ది అన్నలు, తమ్ముళ్లు, అక్కలు, చెల్లెలు పరుగులు తీస్తూ వచ్చారని గుర్తు చేసుకున్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్ లో అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను నిజం చేసి నందుకు ధన్యవాదాలు తెలిపారు. రూ. 2 లక్షల రుణమాఫీ హామీ ఇచ్చినప్పుడు అనేకమంది సందే హాలు వ్యక్తం చేశారని, కానీ మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని రైతుల గుండెల్లో నిలిచిపోయారని సిఎం ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మన ప్రభుత్వానికి రైతుల సహకా రం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.
నల్గొండ నియోజకవర్గం లో 8,358 ఖాతాల ద్వారా 7,890 కుటుంబాలకు రుణమాఫీ జరిగిం దని, ఇందుకోసం మన ప్రభుత్వం 46.16 కోట్ల రూపాయలు కేటాయిం చారని,నల్గొండ జిల్లాలో 83,121 ఖాతాల ద్వారా 78,757 కుటుం బాలు రుణమాఫీ పొందారని, ఇందుకోసం రూ. 481.63 కోట్ల రూపాయలు కేటాయించారని వివరించారు. అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా లక్ష రూపాయల లోపు రుణాలు కలిగిన దాదాపు 11 కోట్ల కుటుంబాలకి 11.50 లక్షల ఖాతాల ద్వారా రూ.6,098 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేసినందుకు ధన్యవాదాలు తెలియ జేశారు మీ సహకారంతో ఎస్ ఎల్ బి సి, బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు గ్రీన్ ఛానల్ (green channel)లో పెట్టి ముందుకు తీసుకుపోయేం దుకు సహకరించిన మీకు కృతజ్ఞ తలoటూ పేర్కొన్నారు. అదే విధంగా నల్లగొండ మా జిల్లా ఇంచా ర్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సహకారంతో మా జిల్లాకు రూ.481.63 కేటాయించినందుకు మంత్రికి ధన్యవాదాలన్నారు.