–మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
Komati Reddy Venkata Reddy: ప్రజా దీవెన, నల్గొండటౌన్: కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో విద్యపై ప్రత్యే క దృష్టి సారించి పాఠశాలలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడం తో పాటు నాణ్య మైన విద్యను అందించే దిశగా ఇప్పటికే అన్ని చర్యలు చేపట్టిందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy Venkata Reddy) అన్నారు. తెలంగాణలో పాఠశాల విద్యపై తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం రూపొందించిన రిపోర్ట్ (report)ను ఆదివారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కు డెవలప్మెంట్ ఫోన్ చైర్మన్ ఎం.వి. గోనారెడ్డి (M.V. Gonareddy)ఆధ్వ ర్యంలో అంద జేశారు.
ఈ సంద ర్భంగా మంత్రి కోమటిరెడ్డి (Komati Reddy Venkata Reddy) మాట్లా డుతూ తెలంగాణలో పాఠశాల విద్యపై తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం సమగ్ర సమాచారం రూపొం దించడం అభినందనీ యమ న్నారు. అదే విధంగా భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్, కుమార్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల నల్లగొండ వీరేశం, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నరసింహారెడ్డి, ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం, పాఠశాల విద్య ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్ర వెంకటేశం, స్కూల్ ఎడ్యుకేషనల్ కమిషనర్ ఇ.వి నర్సింహారెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ఆకునూరి మురళి,వెంకట్ రెడ్డి, సైంటిస్ట్ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య, జెడ్పి సీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, టీచర్స్ యూనియన్ నాయకులు గాలి హర్షవర్ధన్ రెడ్డి తదితరులకు కూడా అందజేశారు.