–ప్రజా దర్బార్ లో మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి
Komati Reddy Venkata Reddy: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: అండదండ లేని ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే తన లక్ష్య మని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సిని మాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata Reddy) అన్నారు. సోమ వారం అయన నల్లగొండ జిల్లా (Nalgonda District) కేంద్రంలోని తన క్యాంపు కార్యాల యం వద్ద ఉన్న మున్సిపల్ పార్కులో ప్రజా దర్బార్ నిర్వహిం చి ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.ఈ సందర్భంగా ప్రజలు వివిధ రకాల సమస్యల ఫిర్యాదులను నేరుగా మంత్రికి అందజేశారు.
మంత్రి ఫిర్యాదులను (Ministerial complaints) స్వీకరించడమే కాకుండా, జిల్లా కలెక్టర్ ను తన క్యాంపు కార్యాల యానికి పిలిపించుకొని ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. అంతేకాక సంబంధిత అధికారులకు అక్కడ నుండే స్వయంగా ఫోన్ చేసి మాట్లా డుతూ ఫిర్యాదులు పరిష్కరిం చాలని ఆదేశించారు. వ్యక్తిగత సమస్యలు ఆరోగ్య నిమి త్తం ఆర్థిక సాయం కోరగా పలువు రికి తక్షణ ఆర్థిక సహా యాన్ని అందజేశారు. విద్యార్థులకు పాఠశాలల, కళాశా లల్లో సీట్లు, ఆరోగ్యం ఇతర వివిధ సమస్యల పిటిషన్లను ఆయన సానుకూలంగా స్వీకరించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారు.జిల్లా కలెక్టర్ సి.నా రాయణరెడ్డి, ఆర్ డి ఓ రవి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి తదితరులు మంత్రి వెంకటరెడ్డి (komati reddy venkata reddy)ఉన్నారు.