Komatireddy Pratik Foundation: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్లగొండ జిల్లా కేంద్ర గ్రంథాలయానికి కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ (Komatireddy Pratik Foundation) చేయూతనందించింది. ప్రతీక్ ఫౌండే షన్ (Komatireddy Pratik Foundation) తరఫున మున్సిపల్ ఛైర్మెన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి గ్రంథా లయానికి విలువైన పుస్తకాలు అందజేశారు. పోటి పరీక్షలకు సన్నద్దమవుతున్న నిరుద్యోగులకి జీకే కి సంబంధించిన పుస్తకాలు, గద్దర్ సమగ్ర సాహిత్యం గ్రంథాలయానికి (comprehensive literature library) అందజేసారు.
కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ (Komatireddy Pratik Foundation) సి.ఇ.ఓ. యం. వి. గోనారెడ్డి, మనిసిపల్ వైస్ చైర్మన్ అబ్బగొని రమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జుకూరి రమేష్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహనరెడ్డి, మాజీ జెడ్పిటిసి వంగూరి లక్షమయ్య, అసిస్టెంట్ లైబ్రేరియన్ కట్టా నాగ య్య తదితరులు పాల్గొన్నారు. గ్రంథాలయానికి పుస్తకాలు అందిం చినందుకు “కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్” చైర్మన్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బి బాలమ్మ కృతజ్ఞలు తెలిపారు. ఇటీవల విద్యార్థుల కోరిక మేరకు ఏసీలు లు , జీకే బుక్స్, మధ్యాహ్న భోజ నం (ACs, GK books, lunch) అందచేస్తున్న మంత్రి కోమ టిరెడ్డి వెంకటరెడ్డి అభినందనీయు లని పేర్కొన్నారు.