–కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున
KVPS: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: సమాజంలో అట్టడుగు పేదల అభివృద్ధి జరిగి అసమానతలు తొలగిపోవా లంటే ప్రతి కుటుంబానికి (family) భూమి పంపిణీ (Distribution of land) జరగాల్సిందేనని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున అన్నారు. గురువారం ఎంబీఎన్ ట్రస్టు భవనం (MBN Trust Building)లో రెండవ రోజు రాజకీయ శిక్షణ తరగతులు జరిగినవి మతం మతోన్మాదం ప్రభావాలు పరిష్కారాలు అనే పాఠాన్ని పిట్టల రవి బోధించారు. తదుపరి జరిగిన కెవిపిఎస్ జిల్లా సమావేశంలో పాలడుగు నాగార్జున మాట్లాడుతూ ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన బడ్జెట్లో కేటాయింపు లు చేసి దళిత గిరిజనుల అభివృద్ధి కి తోడ్పాటు అందించవలసిన అవ సర ము ఎంతో ఉందని అన్నారు. నేడు రాష్ట్రం లో రియల్ ఎస్టేట్ పామ్హౌ జుల పేరు వేలాది ఎకరాల భూమి అభివృద్ధికి నోచుకోకుండా హద్దులు పెట్టి నిరూపియోగంగా మారిందని ఉత్పత్తి లెక నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నా యని అన్నారు. పేదల అభివృద్ధి జరగాలంటే భూమి పంపిణీ జరగాల్సిందేనని డిమాండ్ (demand) చేశారు నేడు కులం పేరా మతం పేరా అసమానతలు సృష్టిస్తున్న రాజకీయ పార్టీలను ఒంటరి చేయవలసిన అవసరం ఉందని అన్నారు.
కుల మతాల కతీతంగా దేశ సమైక్యత సమగ్రతల కోసం పనిచేసే వారిని ప్రజలు స్వీక రిస్తారని అన్నారు. నల్గొండ జిల్లాలో సంక్షేమ హాస్టల్స్ సమస్య లపై (The problem of welfare hostels)5వ తేది నుండి 10 వరకు సమగ్ర సర్వేల నిర్వహించనున్నట్లు తెలియజేశారు. పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని అన్నారు ఒక నాలుగు సంవత్సరాలుగా విద్యార్థుల భవిష్యత్తులతో ఆటలాడుతూ కనీసం బీటెక్ విద్యార్థుల సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదని దళిత గిరిజన విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని వెంటనే నిదులు నిధులు విడుదల చేయాలని డిమాండ్ (demand)చేశారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న బంచరాయి పోరంబోకు పడవు భూములను ఇండ్ల స్థలాల కేటాయించాలని పోరాటం చేయనున్నట్లు తెలిపారు. దళితులపై దాడులు దౌర్జన్యాలు హత్యలు అత్యాచారాలు నిత్య కృత్యమైనాయని పోలీసుల (police) కఠినంగా వ్యవహరించాలని తెలియజేశారు కొన్ని ఘటనలలో పోలీసుల పాత్ర నిర్లక్ష్యంగా పక్షపాతంగా ఉందని పేదలు దళితులకు న్యాయం చేసే విధంగా లేదని పోలీసుల వైఖరిలో మార్పులు రావలసిన అవసరం ఎంతైనా ఉందని కులవేక్ష వ్యతిరేక పోరాట సంఘం భావిస్తున్నది జిల్లా యంత్రాంగానికి గుర్తు చేస్తున్నాము భవిష్యత్తులో పోలీసుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తామని తెలిపారు. రెండు రోజుల క్లాసులు విజయవంతం అయ్యాయని ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను రాష్ట్ర కమిటీ సభ్యులు రెమిడాల పరుష రాములు కోడి రెక్క రాధిక జిల్లా సహాయ కార్యదర్శిలు బొట్టు శివకుమార్ గాదే నరసింహ దైద శ్రీను బొల్లు రవీందర్ ఒంటెపాక కృష్ణ పెరిగే విజయకుమార్ జిల్లా కమిటీ సభ్యులు దంతాల నాగార్జున దేవయ్య దూరపల్లి మల్లయ్య బొడ్డు బాబురావు దండు రవి వంగూరి వెంకటేష్ బొల్లంపల్లి రవి శ్రీకర్ మంజుల సుకన్య లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.