–కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున
KVPS Paladugu Nagarjuna: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: తమిళనాడు రాష్ట్రం శివగంగా జిల్లాలో దళిత యువకుడు అయ్య స్వామి బుల్లెట్ బైకును కొనుగోలు చేసి నడుపుతుంటే జీర్ణీంచుకోలేని అగ్రవర్ణ ఆధిపత్య యువకులు పాశవికంగా ఆ యువకుని రెండు చేతులను నరకడాన్ని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నల్లగొండ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుం దని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్య దర్శి పాలడుగు నాగార్జున అన్నా రు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడున్నర దశాబ్దాలు దాటినా దళితులను ఇంకా మనుషులుగా చూడడం లేదని ఈ వివక్షతలను రూపుమాలపాల్సిన పాలకులే పెం చి పోషిస్తున్నారన్నారు.ఈ దేశంలో మోడీ మతోన్మాదాన్ని తీవ్రంగా పెం చి పోషిస్తున్నాడని మోడి మూడో సారి ప్రధానమంత్రి అయిన తర్వా త దళితులపై దాడులు తీవ్రమ య్యాయని అన్నారు.మన్మధర్మ శాస్త్రం సూచించిన వర్ణ వ్యవస్థను అమలు చేస్తున్నాడని ధ్వజమె త్తారు