Labor Code: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి (Thummala Veera Reddy) కేంద్ర ప్రభు త్వాన్ని (Central Govt) డిమాండ్ చేశారు. సోమ వారం జాతీయ కార్మిక సంఘాలు ప్రజాసంఘాల పిలుపుమేరకు నల్గొండ పట్టణం లో సుభాష్ విగ్రహం దగ్గర నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేసి లేబర్ కోడ్ ప్రతులను దగ్ధం చేయడం జరిగిం ది. ఈ సందర్భంగా వీరారెడ్డి (Thummala Veera Reddy)మాట్లాడుతూ దేశంలో బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను కార్పోరేట్ సంస్థలకు కట్టబెడుతూ దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తుందని ఆరోపించారు. కార్మికులు పోరాడి సాధించుకున్న కనీస వేతనాల చట్టం, పనిగంటల చట్టం, బోనస్ చట్టం, ప్రమాదాల కు నష్టపరిహారం చట్టం తదితర 44 చట్టాలను రద్దుచేసి నాలుగు కోడ్ లుగా పార్లమెంటులో ఆమోదించిందని ఆరోపించారు.
కార్మిక హక్కులను (Labor rights) కాలరాస్తూ యాజమాన్యాలకు తొత్తులుగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ విధానం ద్వారా ప్రభుత్వ రంగ సంస్థలను 70 ఏళ్ల కృషితో పెంచుకున్న ఆస్తులను ధ్వంసం చేయడానికి బరితెగించిందని అన్నారు. మార్పు చేసిన లేబర్ కోడ్ ల వలన వేతనాల పెంపు కోసం బెరసారాలాడే హక్కు కార్మిక వర్గం (Labor class) కోల్పోతుందని, నూతనంగా యూనియన్లు ఏర్పాటు చేసుకోవడానికి కష్టతరమైన నిబంధనలు విధించి కార్మికులను సంఘాలు పెట్టుకోకుండా ఇబ్బందులకు గురిచేస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే పునరాలోచించి కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, జిల్లా సహాయ కార్య దర్శి దండెంపల్లి సత్తయ్య, ఎఫ్సిఐ హమాలి యూనియన్ అధ్యక్షులు పల్లె నగేష్, ఎలక్ట్రిసిటీ స్టోర్ అమాలి వర్కర్స్ యూనియన్ కార్యదర్శి శంకర్, ఎఫ్సీఐ క్యాజువ ల్ వర్కర్స్ యూనియన్ నాయ కులు మాండ్ర శ్రీనివాస్, తెలంగాణ మెడికల్ సేల్స్ రిప్ర జెంటిటివ్ యూనియన్ నల్గొండ బ్రాంచ్ కార్యదర్శి రావుల రవి కుమార్, ఉపాధ్యక్షుడు చెనగో ని మహేష్, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు మన్నె శంకర్ వివిధ సంఘాల నాయకులు యా దగిరి రెడ్డి,నర్సింహ, రమేష్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.