Lakshminarasimha Brahmotsavam: ప్రజా దీవెన, నార్కట్ పల్లి: నల్లగొండ జిల్లాలోని నార్కట్ పల్లి మండలం షాపల్లి గ్రామంలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాలలో ఒకటైన శ్రీశ్రీ కమలాద్రి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆలయం ముస్తాబు అయి వేడుకలకు సన్న ద్ధమైంది. ఈ నెల 8 నుండి( నేటి ) ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలు 10 రోజుల పాటు కొనసాగుతా యని ఆలయ అనువంశిక అర్చకులు కారంపూడి నర్సింహ్మాచార్యు లు, రాకేశాచార్యులు తెలిపారు.
I పది రోజుల ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 8 న తొళక్కం, 9న ప్రబంధ పారాయణా లు, 10న హనుమం త సేవ, పరమ పదోత్సవం, 11న రాత్రికి అంకురార్పణ, 12న ధ్వజా రోహణ (గరుడముద్ద), 13న కళ్యా ణోత్సవ, 14న అశ్వవాహన సేవ, 15న బలిహరణ, నిత్య హోమా లు, 16న దివ్య విమాన రధోత్స వం, రాత్రికి దోపోత్సవం, 17న పు ష్పయాగం, ఏకాంత సేవ, 18న స్వామి వారిని గ్రామంలోని ఆల యంలోకి చేర్చుట, శృంగార డోలో త్సవంతో ఉత్సవ పరిసమాప్తి జరు గనుంది. ఉత్స వాల్లో భాగంగా స్వామి వారి కళ్యాణోత్సవానికి దో పోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. బ్రహ్మోత్సవాల సం దర్భంగా ఆలయాన్ని రంగులతో ముస్తాబు చేసి విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నారు. భక్తులకు ఎటు వంటి 4 అసౌకర్యాలు కలుగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు అర్చకులు తెలిపారు. బ్రహక్ష్మత్స వాల నిర్వహణకు భక్తులు ఆర్థి కంగా హార్ధికంగా సహాయ సహకా రాలను అందించాలని భక్త బృందం కోరారు.
అధిక సంఖ్యలో తరలిరాను న్న భక్తులు…. విశాలంగా ఉండే ఈ క్షేత్రానికి జిల్లాలోని వివిధ ప్రాం తాల నుంచి అధిక సంఖ్యలో భక్తు లు తరలి రానున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కమి టీ సభ్యులు తెలిపారు. ఆల యాన్ని రంగులు, విద్యుత్తు దీపాల తో ప్రత్యేకంగా అలంకరించారు.