–సిఐటియు జిల్లా అధ్యక్షులు చిన పాక లక్ష్మీనారాయణ
Lakshminarayana : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ 18 వేల ఫిక్సి డ్ వేతనం నిర్ణయించాలని పీఫ్, ఈ ఎస్ ఐ, ఉద్యోగ భద్రత కల్పిం చాలని లేదంటే ఆశాలు ఉదృత పోరాటాలకు సిద్ధమవుతారని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ లక్ష్మీనారాయణ ప్రభుత్వా న్ని హెచ్చరించారు. శుక్ర వారం తెలంగాణ ఆశా వర్కర్స్ యూని యన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్లగొండ ఎమ్మెల్యే రోడ్లు భవనాలు మరియు సినిమా ట్రో గ్రఫి మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వ హించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ ప్రభుత్వం ఆశాల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని, ఆశాల వేతనాలు పెంచడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పిస్తామని కనీస వేతనం 18వేలు పెంచుతామని కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆశల సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.సిఐటియు నాయకత్వం లో ఆరోగ్యశాఖ మంత్రి, రాష్ట్ర ఉన్నత అధికారులకు ఎమ్మెల్యేల కు,మంత్రులకు, అనేకసార్లు వినతి పత్రాలు ఇచ్చిన సమస్యలు పరిష్క రించలేదని అన్నారు. అందుకోస మే పోరా టాన్ని చేస్తున్నామని అన్నారు. ఎన్ హెచ్ ఎం స్కీం లో భాగంగా గత 19 సంవత్సరాల నుండి రాష్ట్రంలో ఆశ వర్కర్లు పనిచేస్తున్నారు, వీరంతా బడుగు బలహీన వర్గాలకు చెందిన మహిళలు, రాత్రనకా పగలనకా ఉదయం నుండి రాత్రి వరకు నిరంతరం ప్రజల ఆరోగ్య సేవలు అందిస్తూ డెలివరీల సందర్భంగా రెండు మూడు రోజులు కుటుంబాన్ని వదిలి హాస్పిటల్ వద్ద ఉంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆశాలను ఎట్టి చేయించుకుంటుం దని, పెరిగిన ధరలకు అనుగుణం గా వేతనాలు పెంచాలని కోరారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికా రంలోకి వచ్చిన తర్వాత 45వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సిఫార సులు మాత్రం అమలు చేయలేదని దీనివల్ల తెలంగాణలతోపాటు దేశవ్యాప్తంగా 10 లక్షల మంది ఆశలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనాకాలంలో ఆశల శ్రమను గుర్తించిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆశా వర్కర్లు గ్లోబల్ లీడర్స్ అని ఆశాలకు అవార్డును ప్రకటించింది.కానీ మన కేంద్ర ప్రభుత్వం నేటికీ ఆశల శ్రమను గుర్తించడానికి సిద్ధపడ ట్లేదు పైగా ఎన్ హెచ్ ఎం స్కీంకు బడ్జెట్ ను తగ్గిస్తుంది, కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను తెచ్చి సంఘం పెట్టుకునే హక్కు సమ్మె చేసే హక్కు లేకుండా చేసి కార్మిక హక్కులను కాలరాస్తుందని విమర్శించారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యద ర్శి దండంపల్లి సత్తయ్య, జిల్లా నాయకులు పోలే సత్యనా రాయ ణ, భీమ గాని గణేష్, ఆశ యూని యన్ నాయకులు టీ పార్వతమ్మ, టీ కల్పన, బి మల్లేశ్వరి, కే స్వర్ణ ,ఎర్ర సౌజన్య, ఎస్ విజయ కుమారి, పి ప్రేమలత, పి రాధ, సిహెచ్ వీరభద్రమ్మ, తదితరులు పాల్గొన్నారు