ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కిన్నప్పుడే పండుగ సాయన్నకు మనం ఇచ్చే అసలైన నివాళి అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ అన్నారు.పేద వర్గాల బంధువు పండుగ సాయన్న 134వ వర్ధంతి సందర్భంగా బీసీ కార్యాలయంలో అయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులుర్పించారు.
అనంతరం లింగంగౌడ్ మాట్లాడుతూ ఆనాటి నిజాం నిరంకుశ పాలకులు ప్రజలను పెట్టి చాకిరి పేరుతో హింసిస్తూ,అక్రమ పన్నులు వసూలు చేస్తు, ప్రజల ధన,మాన,ప్రాణాలు దోచుకుంటున్న తరుణంలో ఆ నిజాం నవాబ్ అధికారులను ప్రశ్నిస్తూ వారికి సవాళ్ళుగా మారి వారిని ఎదురించి బహుజన రాజ్య స్థాపనకు ఎంతో ప్రయత్నం చేశారని దాన్ని ఓర్వలేని కొంతమంది ఆధిపత్య శక్తులైన దేశ్ ముఖ్ లు జాగిర్దారులు భూస్వాములు కరణం పటేళ్లు ఆనాటి నిజాం ప్రభుత్వం చేత పండగ సాయన్నను చంపించారని ఆయన బడుగు బలహీన వర్గాల వారికి చేసిన సహాయం ఏనాటికి మరిచిపోరని అన్నారు.
ఆయన స్ఫూర్తితో బడుగు బలహీన వర్గాల వారు ఐక్యమై రాజ్యాధికారం స్థాపించాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బంటు వెంకటేశ్వర్లు గుండెబోయిన నాగేశ్వరరావు యాదవ్ మహేష్ గౌడ్ ఎర్రబెల్లి దుర్గయ్య ఊరి బండి శ్రీనివాస్ యాదవ్ దొనేటి శేఖర్ సత్య ప్రకాష్ నాయుడు శరత్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.