Nominations closed: ముగిసిన నామినేషన్ల ఘట్టం… నల్లగొండలో 56…. భువనగిరిలో 61
లోక్ సభ ఎన్నికల క్రతువులో కీలక ఘట్టం ముగిసింది. గురువారంతో పూర్త యింది. నల్లగొండ, భువనగిరి స్థానాలకు పెద్ద ఎత్తున నామపత్రాలు దాఖల య్యాయి.
నల్లగొండలో 56.. భువనగిరిలో 61 మంది నామినేషన్ దాఖలు
ప్రజా దీవెన నల్లగొండ బ్యూరో: లోక్ సభ ఎన్నికల(Lok sabha elections) క్రతువులో కీలక ఘట్టం ముగిసింది. గురువారంతో పూర్త యింది. నల్లగొండ, భువనగిరి స్థానాలకు పెద్ద ఎత్తున నామపత్రాలు దాఖల య్యాయి. మొత్తంగా నల్లగొండ లోక్ సభ స్థానానికి 56మంది.. భువనగిరి స్థానానికి 61 మంది అభ్యర్థులు నామపత్రాలను దాఖలు చేశారు. చివరి రోజున ఎక్కువ మంది పోటీదా రులు కలెక్టరేట్ కు వరుస కట్టారు. నల్లగొండ స్థానంలో ఒక్క రోజే 37 మంది, భువనగిరిలో స్థానంలో 16 మంది నామినేషన్లు వేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు గుర్తింపు పొందిన పార్టీల వారు, స్వతంత్రులు పోటీకి భారీగానే ఉత్సాహం చూపించారు. ఈ నెల 18వ తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవగా మొదటి రోజు నుంచి మందకొడి గానే అభ్యర్థులు ముందుకొచ్చారు. చివరి మూడు రోజుల్లో నామినేషన్లు గణనీయంగా పెరిగాయి.నల్లగొండ ఎంపీ స్థానం నుండి
24న కాంగ్రెస్ అభ్యర్థిగా కుందూరు రఘువీర్ రెడ్డి నామినేషన్(Raghuveer reddy Nominations) దాఖలు చేశారు. ఈయనకు మద్దతుగా రాష్ట్ర రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర ఇరిగేషన్, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. బిజెపి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. సైదిరెడ్డికి మద్దతుగా కేంద్రమంత్రి కిరేణ్ రిజిజు, కామారెడ్డి ఎమ్మెల్యే కె.వి రమణారెడ్డి,బిజెపి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిహాజరయ్యారు. అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా కంచర్ల కృష్ణారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.ఈయనకు మాజీ మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఇక భువనగిరి స్థానం నుండి ప్రధాన పార్టీ అభ్యర్థులు కాంగ్రెస్ నుండి చామల కిరణ్ కుమార్ రెడ్డి, బిఆర్ఎస్ నుండి క్యామ మల్లేష్, బిజెపి నుండి బూర నర్సయ్య గౌడ్, సిపిఎం నుండి ఎండి. జాంగిర్ బరిలో ఉన్నారు.కాగా స్వతంత్ర అభ్యర్థులకు కూడా భారీ సంఖ్యలోనామి నేషన్లను దాఖలు చేశారు.
నేడు పత్రాల పరిశీలన…
నామినేషన్ దాఖలు గడువు ముగియడంతో శుక్రవారం అధికారులు నామపత్రాలను పరిశీలించనున్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పరిశీలించి ఆమోదం పొందిన వాటి వివ రాల జాబితా కలెక్టరేట్ వద్ద ప్రదర్శిస్తారు. తిరస్క రణకు గురైన నామినేషన్ల వివరాలతోపాటు కార ణాలకు సంబంధిత అభ్యర్థులకు సమాచారం అందిస్తారు. ఈ విషయమై నల్లగొండ, భువనగిరి ఎన్నికల అధికారులు.. అదనపు కలెక్టర్లు, సహా ఎన్నికల సిబ్బందికి తగు సూచనలిచ్చారు. ఎక్కడా చిన్నపాటి తప్పిదం లేకుండా స్క్రూటినీ పూర్తి చేయాలని ఆదేశించారు.
ఆమోదం పొందిన అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకునేం దుకు ఈ నెల 29వ తేదీ వరకు గడువు ఉండ టంతో పోటీలో నిలిచేదెవరో ఆ రోజు సాయంత్రం తేలనుంది. మరోవైపు స్వతంత్రులు ఎక్కువ మంది పోటీకి ఆసక్తిని చూపించడంతో వారిలో కొందరిని తప్పుకోమని ప్రధాన పార్టీల అభ్యర్థులు బుజ్జగించడానికి ప్రయత్నిస్తున్నారు. ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉంటే ఓట్లు చీలడం తోపాటు రెండు ఈవీఎంలను(EVMs) ఏర్పాటు చేయాల్సి ఉండటంతో ప్రధాన పోటీదారులకు అడ్డంకిగా మారబోతోంది. అందుకనే వీలైనంతగా పోటీదా రుల సంఖ్య తక్కువగా ఉండే విధంగా ప్రధాన పార్టీల వారు ప్రయత్నాలు చేస్తున్నారు.
Lok sabha election nominations closed