LRS: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: ఈ నెల 17 నుండి ఎల్ ఆర్ ఎస్ (LRS) దరఖాస్తులను పూర్తి స్థాయిలో పరిష్కరించాలని స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ టి. పూర్ణచంద్ర అన్నారు.బుధవారం ఎల్ ఆర్ ఎస్ పై జిల్లా కలెక్టర్ (Collector) కార్యాలయంలోని ఉదయాదిత్య భవన్ లో నిర్వహిం చిన శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజర య్యా యి.ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎల్ ఆర్ ఎస్ పై ప్రతి గ్రామపంచాయతీ (Grama Panchyathi) కి ఒక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ బృందం లో నీటిపారుదల శాఖ ఏఈ, పంచాయతీ కార్యదర్శి, రెవిన్యూ ఇన్స్పెక్టర్లు ఉంటారని తెలిపారు.
బుధవారం జిల్లాలోని 15 మండ లాల టీములకు శిక్షణ ఇవ్వగా ,ఈ నెల 16న 16 మండలాల బృందా లకు ఎల్ఆర్ఎస్ పై శిక్షణ ఇవ్వను న్నట్లు వెల్లడించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శిక్షణ తీసుకున్న బృందాలు 17వ తేదీన పూర్తిస్థాయిలో పరిష్కారం చేయాలని ఆయన ఆదేశించారు.జిల్లా పంచాయతీ అధికారి మురళి, ఈ డి ఎం దుర్గ రావ్, డిటిసిపి లక్ష్మి నారాయణ, ఆర్డీవోలు (RDO),డి ఎల్ పి ఓ లు,తహసిల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు,ఇరిగేషన్ అసిస్టెంట్ ఇంజనీర్లు, రెవిన్యూ ఇన్స్పెక్టర్లు, ఎంపీఓలు ఈ శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు.
Nalgonda