Madagani Srinivas Goud: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ జెండా ఏగురవేస్తాం : మాదగాని శ్రీనివాస్ గౌడ్
ప్రజా దీవెన,నల్గొండ: నల్లగొండ మండలంలోని మేళ దుప్పలపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్ పాల్గొని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు..
బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్ అంబెడ్కర్ ను రెండు సార్లు పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించిన నీచమైన పార్టీ కాంగ్రెస అని,అలాంటి కాంగ్రెస్ పార్టీకి అంబెడ్కర్ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు.మోస పూరిత హామీలతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఒక సంవత్సరం అయినప్పటికీ కూడా ఏ ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో అమలుచేయడంలో విఫలమైందని బీజేపీ కార్యకర్తలు ఇట్టి విషయాలను ప్రజలకు తెలియజేసి రాబోయే స్థానిక ఎన్నికల్లో గ్రామంలో బీజేపీ జెండా ఎగురవేయాలన్నారు.
మండల ఎన్నికల ఇంచార్జి *బండారు ప్రసాద్ ,రాష్ట్ర నాయకులు పోతేపాక సాంబయ్య మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు…179 బూతు అధ్యక్షులు గా ఆలకుంట్ల సునీల్,కార్యదర్శి గా అన్నేబీమోజు కృష్ణ ప్రసాద్
180 బూతు అధ్యక్షులు గా నందిపాటి రాకేష్, కార్యదర్శి గా ఆలకుంట్ల ప్రకాష్, మరియు మిగతా కమిటీ సభ్యులను…పన్నా ప్రముఖ్ లను ఎన్నుకోవడం జరిగింది..
ఈ సమావేశంలో బీజేపీ నల్లగొండ మండల అధ్యక్షులు బోగరి అనిల్ కుమార్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి రేగట్టే రూక్న గౌడ్ బీజేపీ సీనియర్ నాయకులు ,ముత్యాల శంకర్ రెడ్డి కోమటిరెడ్డి నరసింహ రెడ్డి, నందిపాటి అంజయ్య, దళిత మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు నల్ల నర్సింహా, బిజెవైయం జిల్లా కార్యదర్శి నందిపాటి శ్రీకాంత్,కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, బీజేవైయం మండల అధ్యక్షులు బొమ్మిడి శ్రీకాంత్,మాజీ బూతు అధ్యక్షులు అంతటి శ్రీకాంత్ గౌడ్,ముత్యాల మహేష్ రెడ్డి నాయకులు కోమటిరెడ్డి యాదవ రెడ్డి,యాస రవీందర్ రెడ్డి,చింతపల్లి శంకర్, కురుపాటి ప్రసాద్, గోడ్ల అశోక్,మనిమద్దె నరేష్, చింతల దినేష్ గౌడ్,ఆలకుంట్ల పవన్,అంతటి యశ్వంత్ గౌడ్,గొడ్ల కార్తిక్,పగిడిమర్రి బ్రహ్మచారి, సల్వోజు కళ్యాణ్,ఆలకుంట్ల చింటూ, గొడ్ల రాజు,గొడ్ల నవీంద్ర* తదితరులు పాల్గొన్నారు.