Mahindra Tractors Rally: మహీంద్రా ట్రాక్టర్స్ ర్యాలీ
మహీంద్రా ట్రాక్టర్స్ 60 సంవత్సరా లు పూర్తి చేసుకొని 40 లక్షల హ్యాపీ కస్టమర్స్ కి ఉత్తమ సేవలు అంది స్తున్న శుభ సందర్భముగా
ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: మహీంద్రా ట్రాక్టర్స్ 60 సంవత్సరా లు పూర్తి చేసుకొని 40 లక్షల హ్యాపీ కస్టమర్స్ కి ఉత్తమ సేవలు అంది స్తున్న శుభ సందర్భముగా నల్లగొం డ జిల్లా ఆథరైజ్డ్ డీలర్స్ శ్రీ విష్ణు ప్రియ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో స్థానిక నల్లగొండ షోరూంలో కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. అనంతరం పట్టణం లో భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహీంద్రా ట్రాక్టర్స్ టెరిటరీ మేనేజర్ ఎం బాలకృష్ణ, శ్రీ విష్ణు ప్రియ, మహేంద్ర ట్రాక్టర్స్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ గౌడ్ బద్దం, క్లస్టర్ మేనేజర్లు ఎన్ వేణు,పి రమేష్, సిబ్బంది వెంకటేశ్వర్లు,మధుసూదన్ రెడ్డి, నాగరాజు, రైతు సోదరులు, కస్టమర్లు, ఫైనాన్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.