Mala Mahanadu Protest: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం (Collector Office) వద్ద ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపి అదనపు కలెక్టర్ కు వినతి పూర్ణచందర్ కు వినతి పత్రం ఇచ్చారు. ఢిల్లీలో రామ్ లీలా మైదానం వద్ద ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్, కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్, బీఎస్పీ చీఫ్ బెహన్ జీ మాయావతిలు వర్గీకరణకు వ్యతిరేకంగా, క్రిమిలేయర్ కు వ్యతిరేకంగా వారు బహిరంగ సభ నిర్వహిస్తున్న సందర్భంగా దానికి మద్దతుగా ర్యాలీ చేపట్టి, నిరసనలు తెలిపి కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చారు. ముందుగా మాల మహానాడు (Mala Mahanadu) నాయకులు డిఇఓ (DEO) ఆఫీస్ వద్ద గల డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, ర్యాలీగా బయలుదేరి వచ్చి కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు తాళ్లపల్లి రవి మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు (Supreme Court) ఇచ్చిన వర్గీకరణ జడ్జ్మెంట్ మనువాదుల జడ్జిమెంట్ అని, పెరిగిన జనాభా దామాషా ప్రకారం ఎస్సీ రిజర్వేషన్ ను 15 శాతం నుంచి 30 శాతానికి పెంచమని, ఎస్సీ కుల గణన చేయాలని, ప్రైవేట్ రంగ సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించమని కోరారు. ఎంపర్కల్ డేటా లేకుండా రాష్ట్రాలకు ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం లేదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లోనే ఉందని, క్రిమిలేయరనే సమస్యను తీసుకొచ్చి భవిష్యత్తులో రిజర్వేషన్లు ఎత్తి వేయాలనే కుట్రలో భాగమే ఈ క్రిమిలేయర్ అని అన్నారు. దళితులకు మునిసిపాలిటీ లలో సపాయి కార్మికునిగా పనిచేస్తున్న వ్యక్తికి జాబ్ వస్తే రెండు తరాల వరకు రిజర్వేషన్లు (Reservations) ఉండకుండా ఈ క్రిమిలేయర్ పనిచేస్తుంది.
తెలంగాణ రాష్ట్రంలో మాలలు తక్కువ లేరని, మాల మాదిగలు సమానంగా ఉన్నారని, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వెనక్కి తీసుకునేంత వరకు మాలల పోరాటం ఆగదని అన్నారు. సబ్ కమిటీల లో రిటైర్డ్ జడ్జి లను గానీ, ప్రజెంట్ జడ్జి లను గానీ తీసుకోవాలని ఇటీవల సిఎం కు విన తిపత్రం ఇచ్చామని తెలిపారు.
మాల మహానాడు జాతీయ అధి కార ప్రతినిధి గోలి సైదులు మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు వర్గీకరణ తీర్పు మనువాదులు ఇచ్చిన సూచనకు అనుకూలంగా ఉందని, వర్గీకరణ అంశం రాష్ట్రాలకు వదిలేయడాన్ని ఖండించారు. వర్గీకరణ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెనక్కి తీసుకోవాలని, లేనిచో భారీ ఎత్తున ఉద్యమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షులు చింతపల్లి బాలకృష్ణ, తాళ్లపల్లి సురేష్, గండమల్ల జానయ్య, నాగటి జో సెఫ్, ఏకుల సురేష్, నాగిల్ల మారయ్య, చిలగమల్ల యాదగిరి, గండమల్ల విగ్నేష్, గండమల్ల శ్రీనివాస్, నాగిల్ల మారయ్య, మెరుగుమల్ల బిక్షం, పెరమళ్ళ ప్రమోద్, బొల్లు సైదులు, మేడ సైదులు, కొల్లి మురళి, కొల్లి ఆకాష్, తదితరులు పాల్గొన్నారు.