Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Mallu Bhatti Vikramarka: రాబోయే రెండేళ్లలో ‘ సొరంగం’ పూర్తి

–ప్రాజక్టు పూర్తికి నెలవారీగా నిధుల కేటాయిస్తాం
–నెలకు 400 మీటర్లు చొప్పున సొరంగం తవ్వుతాo
–నెలకు రూ.14 కోట్లతో 20 నెలల్లో ప్రాజెక్టు పూర్తికి అవకాశం
–రెండు సంవత్సరాల క్యాలెండర్ నిర్దేశంతో ఎస్ఎల్ బిసిని పూర్తి చేస్తాం
–సొరంగంతో ఉమ్మడి నల్లగొండ, నాగర్ కర్నూల్ జిల్లాలు సస్యశ్యా మలం
–సొరంగం పనుల పరిశీలన, సమీ క్షా సమావేశంలో ఉపముఖ్య మం త్రి మల్లు భట్టి విక్రమార్క

Mallu Bhatti Vikramarka: ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో రాబోయే రెండేళ్లలో నిర్దిష్ట కాల పరిమితితో ఎస్ ఎల్ బి సి సొరంగం ప్రాజెక్టు పూర్తి చేస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) స్పష్టం చేశారు. సొరంగం ప్రాజెక్టు పూర్తికి నెలవారీగా నిధుల కేటాయిస్తూ నెలకు 400 మీటర్లు చొప్పున సొరంగం తవ్వుతామని, నెలకు రూ.14 కోట్లతో 20 నెలల్లో ప్రాజెక్టు పూర్తికి అవకాశం ఉందని పేర్కొ న్నారు. రెండు సంవత్సరాల క్యా లెండర్ నిర్దేశంతో ఎస్ఎల్ బిసిని పూర్తి చేస్తాం, సొరంగంతో ఉమ్మడి నల్లగొండ, నాగర్ కర్నూల్ జిల్లాలు సస్యశ్యామలం చేస్తామని చెప్పా రు. శుక్రవారం ఉప ముఖ్యమంత్రి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, (Uttam Kumar Reddy, Komati Reddy Venkata Reddy, Legislative Council Chairman Gutta Sukhender Reddy, MLC, MLAs) అధికా రులతో కలిసి సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొరంగాన్ని నెలకు 400 మీటర్లు కాదు అంతకన్నా ఎక్కువ తవ్వినా ఎంత మేరకు తవ్వితే అంత మేర కు బిల్లులు చెల్లించేందుకు ప్రభు త్వం సిద్ధంగా ఉందని, రెండు సం వత్సరాలు క్యాలెండర్ నిర్ణయిం చుకుని ఎస్ ఎల్ బి సి ని పూర్తి చేయాలని అధికారులను ఆదే శించారు. గత పాలకులు, గడిచిన పది సంవత్సరాల్లో ఒక్క కిలో మీట ర్ కూడా తవ్వకుండా శ్రీశైలం సొరం గ మార్గాన్ని గాలికి వదిలేశారని ఆరోపించారు. రూ. 1000 కోట్ల బడ్జెట్ తో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు వ్యయం, గత పాలకుల నిర్లక్ష్యం మూలంగా రూ. 4వేల కోట్లకు పెరిగి రాష్ట్ర ఖజానాపై పెను భారం పడిందన్నారు. సీఎల్పీ నేతగా నేను, పిసిసి అధ్యక్షుడిగా ఉత్తమ్, ఆ తర్వాత పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ , కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొరంగ మార్గం పూర్తికి ఆనాటి ప్రభుత్వం పై తీవ్రవత్తిడి తెచ్చా మని గుర్తు చేశారు. గోదావరిపై లక్ష కోట్లు పెట్టి కాలేశ్వరం కడితే కుంగి పోయిందని, కృష్ణానది పై దృష్టి పెట్టకపోవడంతో పాలమూరు పూర్తి చేయలేదు. నీళ్ల కోసం కొట్లా డి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం లో అటు గోదావరి ఇటు కృష్ణ నుంచి గత పది ఏళ్లలో ఒక్క ఎకరా కు నీళ్లు రాలేదన్నారు.

కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన జలయ జ్ఞం ప్రాజెక్టులను (Jalayagnam project)గత పాలకులు పూర్తి చేసి ఉంటే ఈ రాష్ట్రం సస్య శ్యామలం అయ్యేది.. నీళ్ల కోసమే సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారన్నారు. ప్రగతిలో ఉన్న ప్రాజెక్టును వదిలేసి రీడిజన్ల పేరిట గత ప్రభుత్వం లక్షల కోట్లు దోపిడీ చేసిందని, ఫలితంగా రాష్ట్ర ఖజా నా దివాలా తీసి ఏడు లక్షల కోట్ల మేర అప్పులు పేరుకుపోయాయని వెల్లడించారు. ఆ బాధతోనే గత ఏడాది మండుటెండల్లో మార్చి నుం చి జూలై వరకు నాలుగు నెలల పాటు రాష్ట్రంలో పాదయా త్ర చేశానని, పీపుల్స్ మార్చ్ పాద యాత్రలో భాగంగా అన్ని ప్రాజెక్టుల దగ్గరకు వెళ్లి లెక్కలతో సహా రాష్ట్ర ప్రజలకు వివరించాను ఆ క్రమంలో ఎస్ఎల్బీసీ దగ్గరకు సైతం వచ్చా నని, టిఆర్ఎస్ ప్రభుత్వం (TRS Govt) ప్రాజెక్టు లు పూర్తి చేయడం లేదని, వచ్చేది ఇందిరమ్మ ప్రభుత్వమే అధికా రంలోకి రాగానే ఇక్కడే కూర్చొని సమీక్ష చేసి ప్రాజెక్టును పూర్తి చేస్తామని నాడు పీపుల్ మార్చ్ పాదయాత్రలో ప్రకటించానని గుర్తు చేశారు. ప్రజలందరి ఆశీస్సులతో అన్నట్టుగానే రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిందని, పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందు కు రాష్ట్ర ప్రభుత్వం ఒక విధాన నిర్ణ యం తీసుకుంది. ఆరు నెలలు ఏడాది రెండు సంవత్సరాలు, ఐదు సంవత్సరాలలో పూర్తయ్యే ప్రాజె క్టులను గుర్తించి ప్రాధాన్యత క్రమాన్ని నిర్ణయించి ముందుగా పూర్తయ్యే ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

శ్రీశైలం ప్రాజెక్టులో డెడ్ స్టోరేజీ ఉన్న ఎస్ ఎల్ బి సి పూర్తి అయితే నాగ ర్ కర్నూల్, నల్లగొండ జిల్లాలకు సాగు, తాగునీరు అందుతాయ న్నారు. నక్కలగండి, ఉదయ సముద్రం, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో నెల నెల నిధులు కేటాయించి పూ ర్తి చేస్తామన్నారు. రాష్ట్రాన్ని సస్య శ్యామలం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) కట్టుబడి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, చేస్తున్న పనులను నాయకులు, కా ర్యకర్తలు గడపగడపకు తీసుకె ళ్లాలని పిలుపునిచ్చారు. సబ్ స్టేష న్లు, ఇతర విద్యుత్తు అవసరాలకు సంబంధించి ఎమ్మెల్యేలు ఇచ్చే ప్రతిపాదనలను పరిశీలించి విద్యు త్ అధికారులు వెంటనే అనుమతు లు ఇవ్వాలని సూచించారు.