–ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి డిమాండ్
Mallu Lakshmi: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: కాంగ్రెస్ పార్టీ 2023 డిసెంబర్ ఎన్నికల సందర్భంగా మహాలక్ష్మి పథకంలో (Mahalakshmi Scheme) భాగంగా ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తానన్న హా మీని నిలబెట్టుకోవాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి (Mallu Lakshmi)డిమాండ్ చేశారు.స్థానిక దొడ్డి కొమురయ్య భవన్ లో బుధవారం ఐద్వా నల్లగొండ జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షురాలు పొలబోయిన వరలక్ష్మి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మల్లు లక్ష్మి మాట్లాడు తూ మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసి ఉచిత ప్రయా ణం, గ్యాస్ సిలిండర్ సబ్సిడీని అమ లు చేయడాన్ని స్వాగ తిస్తూనే ఆ పథకంలో భాగమైన ప్రతి మహిళకు 2500 రూపాయల నగదును అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్నా నేటికీ అమలు చేయలేదు. వేగవంతంగా ఈ పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం కార్యచరణ ప్రకటిం చాలని డిమాండ్ చేశారు.
వర్షా భావ పరిస్థితుల వల్ల విష జ్వరాలు (Poisonous fevers)వేగవంతంగా విస్తరి స్తున్నాయని, ప్రభుత్వం తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించి చికెన్ గునియా, డెంగ్యూ(Chicken Gunia, Dengue) లాంటి వ్యాధులకు అన్ని ప్రైవేటు దావకానాల్లో ఉచిత వైద్యం అందించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్, ప్రైవేటు దావకానాలు (Corporate and private claims) దోపిడీ విష జ్వరాల పేరుతో విపరీతంగా దోపిడీ పెరిగిపోయిందని, అధికా రులు సైతం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని వారు అన్నా రు.ప్రభుత్వ దావకానాలో తీవ్రమైన బెడ్స్ కొరత ఉందని విష జ్వరాలపై రోజురోజుకు సమీక్ష సమావేశాలు నిర్వహించి నివారణకు కృషి చేయాలన్నారు. సంక్షేమ హాస్టల్ లో కనీసం కూడా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితుల గురించి పట్టించుకోవడంలేదని వారన్నారు.
కనీస మౌలిక సౌకర్యాల కల్పనలో పూర్తిగా వైఫల్యం చెందారని అన్నారు.హాస్టల్స్ లో రోజువారీగా వైద్యులు పరీక్షలు నిర్వహించాల న్నారు.ఈ జిల్లా కమిటీ సమావే శంలో జిల్లా కార్యదర్శి పాలడుగు ప్రభావతి,జిల్లా సహాయ కార్యదర్శి కొండ అనురాధ,జిల్లా సహాయ కార్యదర్శి జిట్ట సరోజ జిల్లా ఉపాధ్యక్షురాలు జిల్లా సహాయ కార్యదర్శి దైద జానకమ్మ తుమ్మల పద్మ జిల్లా సహాయ కార్యదర్శి చానబోయిన నాగమణి జిల్లా సహాయ కార్యదర్శి భూతం అరుణకుమారి జిల్లా సహాయ కార్యదర్శి పాదూరి గోవర్ధన జిల్లా సహాయ కార్యదర్శి కారంపొడి ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.