Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Mallu Lakshmi: మనువాదం మానవాలి మనుగడకు ముప్పు

ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: మనువాదం మానవాలి మనుగడకు తీవ్రమైనా ముప్పు అని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు. ఈరోజు నల్గొండ మహిళా సంఘం ఆధ్వర్యంలో పికనిక్ వర్కుషాప్ జిల్లా అధ్యక్షురాలు పోలేబోయిన వరలక్ష్మి అధ్యకక్షతన pa పల్లి మండలం పుట్టoగండి వద్ద జరిగింది. ముఖ్య అతిధిగా మల్లు లక్ష్మి పాల్గొని మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సాక్షాత్తూ రాజ్యసభలో బాబా సాహెబ్‌ డాక్టర్‌ అంబేద్కర్‌ పేరును ఉచ్ఛరిస్తూ చేసిన అహంకారపూరిత వ్యాఖ్యల పట్ల దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోందని,75 ఏళ్ల భారత రాజ్యాంగంపై చర్చ జరుగుతున్న సమయంలోనే- ఆ రాజ్యాంగ నిర్మాతను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం దారుణమని, ఆయన తక్షణం క్షమాపణ చెప్పటంతో పాటు తన పదవి నుంచి వైదొలగాలని మల్లు లక్ష్మి డిమాండ్ చేశారూ.

”అంబేద్కర్‌ అంబేద్కర్‌ అంబేద్కర్‌ అంబేద్కర్‌ అనటం ఫ్యాషనై పోయింది. అదేదో వందసార్లు భగవంతుడి పేరు ఉచ్ఛరించినా స్వర్గలోకంలో స్థానం దొరుకుతుంది.” అంటూ అమిత్‌ షా విపక్షాలపై విరుచుకుపడుతూ, తన మనువాద ధోరణిని బయటపెట్టుకున్నారాణి అన్నారు. అంబేద్కర్‌ పేరు ఉచ్ఛరించటమే నేరమన్నట్టుగా అసహనం ప్రదర్శించి, బిజెపి అసలు బుద్ధిని చూపించుకున్నారు. ప్రతిపక్షాలు అభ్యంతరం చెప్పాకైనా ఆయన చేసిన తప్పుకు లెంపలేసుకొని సభను క్షమాపణ కోరాల్సింది. ఆ పని చేయకపోగా అన్ని సందర్భాల్లాగానే ఈసారి కూడా విపక్షాలపై విరుచుకుపడ్డమే విధానంగా హోంమంత్రి, ఆయన పరివార గణమూ వ్యవహరించటం సిగ్గుచేటన్నారు. తగుదునమ్మా అని ప్రధాని మోదీ తన అనుంగు అనుచరుడిని వెనకేసుకురావటం, ఎప్పటిలాగానే నెహ్రూని, కాంగ్రెస్‌ని రంగంలోకి లాక్కొచ్చి పాత పాటలే వల్లెవేయడం దబాయింపు ధోరణికి పరాకాష్ట.

అమిత్‌ షా అక్కసు వాక్కులు అప్పటికప్పుడు అనుకోకుండా, ఆవేశపరంగా వచ్చినవి కావు. సంఘ పరివారం అణువణువునా అంబేద్కర్‌ పట్ల జీర్ణించుకొని ఉన్న అసహనపు భావజాలానికి బహిర్గత వ్యక్తీకరణే అది. దేశానికి దశాదిశా నిర్ణయించుకొని, అంబేద్కర్‌ అధ్యక్షతన భారత రాజ్యాంగం రూపొందించుకొన్న తరుణంలో నేటి బిజెపి మాతృసంస్థ అయిన రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్ు (ఆర్ఎస్ఎస్‌) తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. తాము అత్యంత ప్రామాణికంగా భావించే మనుస్మ ృతికి స్థానం లేకుండా పోయిందే అని స్వయంగా గోల్వాల్కర్‌ తమ ఆర్గనైజర్‌ పత్రికలో వ్యాసాలు రాసుకున్నారు. దేశానికి ఈ రాజ్యాంగం పనికి రాదని, మూడు రంగుల జెండా అరిష్టమని పేర్కొనటమే కాదు; కొంతమంది రాష్ట్ర ప్రేమి యువదళ్‌ కార్యకర్తలు 2021లో నాగ్‌పూర్‌ ఆర్ఆర్ఎస్‌ కార్యాలయం మీద బలవంతంగా మువ్వన్నెల జెండా ఎగురవేసేదాకా వాళ్లు జాతీయజెండాను గుర్తించలేదని అన్నారు.

ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి మాట్లాడుతూ అవకాశం వచ్చిన ప్రతిసారి రాజ్యాంగంపై విరుచుకుపడడం చాలామంది కాషాయదళ నాయకులకు అలవాటే. గత లోక్‌సభ ఎన్నికల తరుణంలో 400 సీట్లు సాధిస్తే రాజ్యాంగం మార్చి తీరుతామంటూ కొంతమంది బిజెపి నాయకులు బాహాటంగా ప్రకటించిన సంగతి విదితమే! నోటితో నవ్వి నొసటతో వెక్కిరించిన తీరుగానే బిజెపి అంబేద్కర్‌ పట్ల వ్యవహరిస్తూ ఉంటుంది. ఆయన విగ్రహానికి భారీగా పూలదండలు వేసి, ఘనంగా కబుర్లు చెప్పటం; రాజ్యాంగం నిర్దేశించిన విలువలను, రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేయడం ఆ పార్టీ కపట నీతి నిద్రషణమని అన్నారు. మనుస్మృతి అత్యంత దుర్మార్గమైనదని, ఈ దేశానికి ఏమాత్రం పనికిరాదని అంబేద్కరే స్వయంగా దానిని దగ్ధం చేశారు.

అలాంటి కాలం చెల్లిన క్రూరమైన మనువాదాన్ని నెత్తిన పెట్టుకొని, సనాతనమే తమ అభిమతంగా ఊరేగే బిజెపి గణం ఇక అంబేద్కర్‌ మహాశయుడి మార్గాన్ని ఎక్కడ గౌరవిస్తుంది? లోన ఒకటి బోధిస్తూ, అభిమానిస్తూ, బయట రకరకాల రంగుల మార్చే నటనా విన్యాసాలు చేయడం; అధికార అవసరాలకు తగ్గట్టుగా అబద్ధాలకు తెగించటం సావార్కర్‌ కాలం నుంచీ సంఫ్ు పరివారానికి అలవాటని అన్నారు. ఈ నేపథ్యంలోనే అమిత్‌ షా అసహనంలోంచి అహంకారపు వ్యాఖ్యలు బయటకొచ్చాయి. ఈ తరహా పెత్తందారీ పోకడలు భారత రాజ్యాంగపు స్ఫూర్తికి ప్రమాదకరం. కాబట్టి హోంమంత్రి అమిత్‌ షా బుకాయింపు పర్వాన్ని కట్టిపెట్టి, బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. రాజ్యాంగబద్ధంగా ప్రాప్తించిన పదవి నుంచి తక్షణమే తప్పుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమం లో ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యులు కొండా అనురాధ జిట్టా సరోజ జిల్లా ఆఫీస్ బేరర్స్ పద్మ భూతం అరుణ,నాగమణి, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.