ప్రజాదీవెన, నల్గొండ : మహాత్మ విశ్వవిద్యాలయం గణిత విభాగంలో శ్రీనివాస రామానుజo జయంతి నీ గణిత విభాగ అధిపతి డాక్టర్ మద్దిలేటి పసుపుల అధ్యక్షతన ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రేమ్ సాగర్ మాట్లాడుతూ జాతీయ గణిత దినోత్సవ ముఖ్య ఉద్దేశాన్ని వివరిస్తూ గణిత విభాగం అన్ని రంగాల్లో ముందంజలో ఉందని మరియు గణిత విద్యార్థులు కూడా అన్ని విషయాల్లో ముందుండాలని సమాజంలో ఉండే విద్యార్థులకు గణితం పై మక్కువ పెంపొందించాలని విద్యార్థులకు సూచించారు.
గణిత విభాగ ఆచార్యులు డాక్టర్ జి ఉపేందర్ రెడ్డి మరియు డాక్టర్ మద్దిలేటి పసుపుల ఈనెల 13 నుంచి 15 వరకు నేపాల్ దేశంలోని ఖాట్మండు ప్రాంతంలో త్రిబుల్ వన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరిగిన వెళ్లి అక్కడ వీళ్ళ పరిశోధన పత్రాలను సమర్పించినందుకు ఉపకులపతి ఆచార్య ఖజా అల్తాఫ్ హుస్సేన్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అల్వాల రవి ప్రిన్సిపాల్ అభినందించారు. డాక్టర్ జి ఉపేందర్ రెడ్డి, డాక్టర్ డి ఐమావతి, డాక్టర్ ఏ శ్రీనివాస్ డాక్టర్ ఎన్ కిరణ్ కుమార్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. చివరగా డాక్టర్ జి ఉపేందర్ రెడ్డి మరియు డాక్టర్ మద్దిలేటి పసుపుల ఇద్దరినీ అంతర్జాతీయ సదస్సు కు పంపించిన యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ కాజా అల్తాఫ్ హుస్సేన్ కు మరియు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అల్వాల రవికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.