May Day : వాడవాడలా మేడే ఘనంగా నిర్వహించాలి
ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే సందర్భంగా అన్ని యూనియన్లు కార్మిక వాడలలో ఎర్రజెండాలను ఆవిష్కరణలు చేసుకొని ప్రదర్శన లు నిర్వహించాలని సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చినపాక లక్ష్మీనారాయణ తుమ్మల వీరారెడ్డి పిలుపునిచ్చారు.
ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే(May Day) సందర్భంగా అన్ని యూనియన్లు కార్మిక వాడలలో ఎర్రజెండాలను ఆవిష్కరణలు చేసుకొని ప్రదర్శన లు నిర్వహించాలని సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చినపాక లక్ష్మీనారాయణ తుమ్మల వీరారెడ్డి పిలుపునిచ్చారు. గురువా రం దొడ్డి కొమురయ్య భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
1886 మే 1న అమెరికా దేశంలోని లోని చికాగో(Chicago) నగరం హే మార్కెట్లో 8 గంటల పని విధానం కోసం లక్షలాదిమంది కార్మిక ప్రదర్శన పై పాలకవర్గం ఆదేశాల మేరకు పోలీసులు విచక్షణారహితంగా జరిపిన దాడిలో మరణించిన వీరుల రక్తంలో నుండి పుట్టిన ఎర్రజెండా ఎనిమిది గంటల పని విధానం, అనేక కార్మిక హక్కులు సాధించబడ్డాయని అన్నారు. నేటి పాలకుల విధానాల మూలంగా కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను బిజెపి ప్రభుత్వం హరించి వేస్తుందని ఆరోపించారు.
ప్రభుత్వ రంగ సంస్థలను కార్పోరేట్(Corporate) శక్తులకు కారు చౌకగా అమ్ముతూ దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. బిజెపి ప్రభుత్వం దేశంలో మత విద్వేషాలను రెచ్చగొడుతూ మతతత్వ కార్పొరేట్ విధానాలను అవలంబిస్తూ ప్రాంతీయ వైశ్యామ్యా లు, దురహంకార ధోరణలు పెరిగిపోయాయని ఆరోపించారు.
మే డే స్ఫూర్తితో కార్మిక వర్గ ఐక్యత సాధిస్తూ మతతత్వ(Religion) విధానాలు అవలం బిస్తున్న బిజెపిని(BJP) ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించడానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.ఈ విలేకరుల సమావేశంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండెం పల్లి సత్తయ్య, జిల్లా నాయకులు జిట్టా నగేష్ ,ఒంటెపాక వెంకటే శ్వర్లు, అద్దంకి నరసింహ, సలివోజు సైదాచారి, తాడువాయి రాములు తదితరులు పాల్గొన్నారు.
May day celebrations in Nalgonda