Mayday : మేడే ను వాడవాడలా జరపాలి
ప్రపంచ కార్మిక పోరాట దినోత్సవం 138వ మేడే వారోత్సవాలను కార్మికులు వాడవాడలా ఎర్రజెం డాలను ఎగురవేసి ఘనంగా జరపాలని సి పి ఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఇందూరు సాగర్, ఇఫ్టూ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మిడి నగేష్ లు పిలుపునిచ్చారు.
ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: ప్రపంచ కార్మిక పోరాట దినోత్సవం(world labour day) 138వ మేడే వారోత్సవాలను కార్మికులు వాడవాడలా ఎర్రజెం డాలను ఎగురవేసి ఘనంగా జరపాలని సి పి ఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ(New Democracy) జిల్లా కార్యదర్శి ఇందూరు సాగర్, ఇఫ్టూ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మిడి నగేష్ లు పిలుపునిచ్చారు.
స్థానిక శ్రామిక భవన్ లో ఇఫ్టు ఆధ్వర్యంలో ము ద్రించిన గోడ పోస్టర్ లను ఆవిష్క రించారు. ఈసందర్భంగా మాట్లా డుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ(Narendra Modi)ప్రభుత్వం, ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాల ను నాలుగు కోడులుగా కుదించి కార్మికులను కట్టు బానిసలుగా చేసే కుట్రకు వడిగట్టిందన్నారు.
8 గంట లకు బదులు 12 గంటలు పనిచేసే విధానాన్ని తీసుకువచ్చి కార్పొరేట్, బహుళజాతి సంస్థలకు అనుగు ణంగా వ్యవహరిస్తోందని తెలిపా రు. రైతు వ్యతిరేక చట్టాలను తీసు కొచ్చి రైతులను మోసం చేశాడన్నా రు. దేశంలో మత విద్వేషాలను రెచ్చగొడుతూ ప్రజల మధ్య ఐక్య తను, శ్రమజీవుల మధ్య ఐక్యత పై దాడి చేస్తుందన్నారు.
కార్మిక వర్గం ఇటువంటి విభజన విధానాలను తిప్పికొట్టాలని బిజెపి కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలని, బిజెపి(BJP) కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక చట్టాల రద్దు, ప్రభుత్వ రంగ సంస్థల ను ప్రైవేటీకరణ, పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలను పెంపు వంటి ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలపై కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్, స్కీం రంగాల కార్మికుల ను రెగ్యు లరైజ్ చేయాలని, కార్మిక వర్గం ఐక్యతను విస్తృతం చేసి బలమైన కార్మిక పోరాటాలు నిర్వహించాల్సి న అవసరం ఎంతైనా ఉందని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మోటర్ రంగ కార్మికులకు ఇచ్చిన హామీల మేరకు నెలకు 15వేలు హార్దిక సహాయం అందించి ఆదుకోవాలని, అసంఘటిత కార్మికులకు ఉద్యోగ,సామాజిక భద్రత కల్పించాలని, వేతనాలను ప్రతినెల ఇవ్వాలని అన్నారు. కేంద్రం లో,రాష్ట్రంలో పాలకులు అనుసరిస్తున్న కార్మిక, ప్రజావ్యతి రేకత విధానాలపై కార్మికులు, ప్రజలు ఉద్యమిం చాలని , మేడే వారోత్సవాలు వాడవాడలా జరపాలని, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని అన్నారు.
ఈకార్యక్రమంలో పి.వై.ఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.వి చారి, భారత కార్మిక సంఘాల సమాఖ్య రావుల వీరేష్, పొట్లపల్లి రామకృష్ణ, కత్తుల లింగస్వామి, తీగల నరసింహ, అక్కనపల్లి అంజి, మేకల మహేష్, ఊట్కూరు దశరథ, జింజిరాల సైదులు, మామిడాల ప్రవీణ్,రావుల గణేష్, బాలాజీ నాయక్ పాల్గొన్నారు.
Mayday should be held as usual