MD Salim: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమ బోర్డు నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వ కుట్రలను తిప్పి కొట్టాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం (MD Salim) పిలుపునిచ్చారు. మంగళవారం సుందరయ్య సెంట్రింగ్ సొసైటీ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం సుందరయ్య భవన్లో జరిగింది. ఈ సందర్భంగా సలీం మాట్లాడతు భవన నిర్మాణ కార్మికులు అనేక సంవత్సరాలు పోరాడి వెల్ఫేర్ బోర్డు (Welfare Board)సాధించుకున్నారని ఆ వెల్ఫేర్ బోర్డు నుండి కార్మికులకు సుమారు 11 రకాల స్కీములు కార్మికులకు అందుతున్నాయని అందులో ప్రభుత్వం తన పని నుండి తప్పుకోవడానికి నాలుగు రకాల స్కీములను టెండర్ ప్రక్రియ ద్వారా ప్రైవేటు ఇన్సూరెన్స్ సంస్థలకు అప్పజెప్పి వెల్ఫేర్ బోర్డును నిర్వీర్యం చేసే కుట్ర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయని ఆరోపించారు. వెల్ఫేర్ బోర్డులో నిధులను అడ్వైజరీ కమిటీ (Advisory Committee)ద్వారా కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేయాలని, దారి మళ్లించిన నిధులను తిరిగి బోర్డులో జమ చేయాలని అన్నారు.
1996 భవన నిర్మాణ కార్మికుల (Construction workers) కేంద్ర చట్టం, 1976 వలస కార్మికుల చట్టాలను రాష్ట్ర వెల్ఫేర్ బోర్డును రక్షించాలని అన్నారు. వెల్ఫేర్ బోర్డు అడ్వైజరీ కమిటీని కార్మిక సంఘాల ప్రతి నిధుల భాగస్వామ్యంతో నియ మించాలని డిమాండ్ చేశారు. బోర్డు నిధులు దుబారా కాకుండా ఖర్చు చేయాలని 60 సంవత్సరాలు నిండిన ప్రతీ కార్మికుడికి వెల్ఫేర్ బోర్డు ద్వారా పదివేల రూపాయలు పెన్షన్ (Pension)ఇవ్వాలని, ప్రమాద మరణం 10 లక్షలు, సాధారణ మరణం ఐదు లక్షలకు పెంచాలని, ప్రసూతి , వివాహ కానుక లక్షకు పెంచాలని డిమాండ్ (demand)చేశారు. నూతన కమిటీ కార్మికుల హక్కుల రక్షణ కోసం నిరంతరం పనిచేయాలని సూచిం చారు. ఈ కార్యక్రమంలో 4 వార్డు కౌన్సిలర్ బోగరి ఆనంద్, సిఐటి యు జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పోలే సత్యనారాయణ , పట్టణ అధ్యక్షులు సలివొజు సైదాచారి, సీనియర్ నాయకులు మాజీ అధ్యక్షులు బిరుదొజు రామాచారి, పాక మల్లయ్య , బచ్చలకూరి గురువయ్య, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
నూతన కమిటీ ఎన్నిక… అధ్యక్షులు నోముల యాదయ్య (President Nomula Yadiah) కార్యదర్శి దేవరంపల్లి రామ్ రెడ్డి డైరెక్టర్లు జక్కలి సత్తయ్య, బత్తుల రవి, బొజ్జ సైదులు, పానుగంటి నాగరాజు, రాసమల్ల సైదులు, మన్నేశంకర్, కోఆప్షన్ సభ్యులు పికినీటి ముత్యాల చారి, చిత్రం అంతయ్య, ఆమంచి మధు, ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ అధ్యక్షులు బచ్చలకూరి గురువ య్య , మాజీ ఉపాధ్యక్షులు పాక లింగయ్య, మాజీ డైరెక్టర్లు రాచ కొండ గిరి ముక్కముల ముత్త య్య , సోమనబోయిన యాద య్య, నాంపల్లి వెంకన్న లకు సన్మానం చేసి వీడ్కోలు పలికారు