MD Salim: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: మున్సిపల్ కార్మికులకు (municipal workers) పెండింగ్ ఏరియర్స్ వెంటనే చెల్లించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు, మాజీ కౌన్సిలర్ ఎండి సలీం (MD Salim) డిమాండ్ చేశారు. బుధవారం నల్లగొండ మున్సిపల్ కార్యాలయం ముందు తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూ నియన్ (Municipal Workers and Employees Union)నల్గొండ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సమస్యల పరి ష్కారం కోసం ధర్నా చేసి అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ కు వినతిప త్రం సమర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా సలీం మాట్లాడుతూ నల్లగొండ మున్సిపాలిటీలో (Nalgonda Municipality) పని చేస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులకు రావలసిన 11వ పి ఆర్ సి పెండింగ్ ఏరియర్స్ ఇవ్వాలని అనేకమార్లు విజ్ఞప్తి చేసిన ఫలితంగా దశలవారీగా ఇస్తామని హామీ ఇచ్చి రెండు విడతలుగా ఇచ్చి ఆపివేయడం జరిగిందని అన్నారు. తక్షణమే ఏరియర్స్ ఇప్పించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే నల్గొండ మున్సిపాలిటీలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులకు గత అనేక సంవత్సరాలుగా బట్టలు చెప్పులు సబ్బులు, నూనెలు గ్లౌజులు టవల్ లు, రైన్ కోట్లు ఇవ్వడం జరుగుతుందని గత రెండు సంవత్సరాలుగా టెండర్లు పిలుస్తున్నామనే పేరుతో ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. వాటిని వెంటనే ఇవ్వాలని డిమాండ్ (demand)చేశారు. ఆదివారం ,పండుగ, జాతీయ సెలవులు లలో పనిచేస్తున్నప్పటికీ తదుపరి రోజుల్లో సెలవు ఇచ్చే ఆనవాయితీ ఉండేది.
ఇప్పుడు సెలవులు ఇవ్వకుండా, కొన్ని సందర్భాల్లో ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా పని చేయించుకుంటున్నారని అన్నారు. పట్టణంలో కౌన్సిలర్లు వాళ్ళ బంధువులు కూడా కార్మికులను బూతులు తిడుతూ వేధింపులకు గురి చేస్తున్నారు.విలాంటి వాటిపై కమిషనర్ కు అనేక మార్లు నోటీస్ ల మౌఖికంకంగా,తెలియపరిచినప్పటి ఎటువంటి చర్యలు లేవని ప్రజాప్రతినిధుల వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. పెండింగ్ ఏరియర్స్ ,సెలవులు, బట్టలు చెప్పులు (Pending arrears, holidays, clothes and shoes)తక్షణమే ఇవ్వా లని లేనియెడల పట్టణంలో మొత్తం పారిశుధ్య పనులు నిలిపివేసి సమ్మె చేస్తామని హెచ్చ రించారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండెం పల్లి సత్తయ్య తెలంగాణ మున్సి పల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ పట్టణ కార్యదర్శి పెరిక కృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ పేర్ల సంజీవ, కోశాధికారి పాలడుగు వెంకటేశం కత్తుల కృష్ణవేణి తీగల ఎల్లమ్మ పాండు పందుల లింగయ్య తదితరులు పాల్గొన్నారు.