Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MGU: మానవ వ్యాధుల నివారణలో ఔషధ మొక్కల పాత్ర కేలకం : ఆచార్య ముస్తఫా

MGU: ప్రజాదీవెన, నల్గొండ : మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం వృక్షశాస్త్ర విభాగం ఔషధ మొక్కలపై నిర్వహించిన అతిధి ఉపన్యాస కార్యక్రమoలో కాకతీయ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు ఆచార్య ముస్తఫా ప్రసంగించారు. ఆచార్య ముస్తఫా తన ప్రసంగంలో వృక్షాల వర్గీకరణ, ఔషధ మొక్కలు, వృక్షజాతుల గుర్తింపు , ముఖ్యంగా వ్యాధుల నివారణలో మొక్కల యొక్క పాత్రను విద్యార్థులకు వివరించారు.

మానవ మనుగడకు మొక్కల ఆవశ్యకతను మరియు సంరక్షణ బాధ్యతను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో వృక్షశాస్త్ర విభాగ అధిపతి, మరియు కళాశాల ప్రిన్సిపాల్ డా ప్రేమ్ సాగర్, అధ్యాపకులు డా శ్రీను , డా వై వెంకటేశ్వర్లు,డా టి నరసింహస్వామి, డా శ్రావ్యపురి మరియు విద్యార్థులు పాల్గొన్నారు.